E-Paper
Advertisement

విశాఖకు బే-టెక్ హంగులు.. సైబరాబాద్ తరహాలో అభివృద్ధి.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

విశాఖకు బే-టెక్ హంగులు.. సైబరాబాద్ తరహాలో అభివృద్ధి.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Advertisement

Visaka Bay-Tech City: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను మూడు ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులను ప్రాజెక్టులుగా మార్చడం ద్వారా ఉద్యోగాలు, జీవనోపాధి పెరిగి తలసరి ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

రూ. 9 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు

ఆర్థిక రీజియన్ల ప్రణాళికలపై గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడంతో పాటు ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ‘సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్’ కింద రూ. 9,180 కోట్ల విలువైన 60 ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.

సైబరాబాద్ తరహాలో విశాఖ ‘బే-టెక్ సిటీ’

Advertisement

విశాఖపట్నం ఆర్థిక రీజియన్‌కు ‘బే-టెక్ సిటీ’ (Bay-Tech City) యాంకర్ ప్రాజెక్టుగా నిలుస్తుందని సీఎం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని సైబరాబాద్ తరహాలో విశాఖను ఆనుకుని ఒక నూతన అర్బన్ సెంటర్‌గా దీనిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ రీజియన్‌లో గుర్తించిన మొత్తం 167 ప్రాజెక్టులలో ఇప్పటికే 64 ప్రాజెక్టులు అమలు దశలోకి వచ్చాయని ఆయన వివరించారు.

సెమీకండక్టర్ క్యాపిటల్‌గా తిరుపతి

తిరుపతి రీజియన్‌లోని 16 పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుపతిని టెక్నాలజీ, పరిశ్రమలు మరియు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా నిలబెట్టేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్ రంగాల్లో డిజైన్, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి క్లస్టర్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ ప్రాంతానికి వస్తున్న దాదాపు రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ. 5.70 లక్షల కోట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే అరుదైన ఖనిజాల ఆధారిత మాగ్నెటిక్ క్లస్టర్ ఏర్పాటుతో పాటు, మూడేళ్లలో హార్టికల్చర్ హబ్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

అమరావతిలో ‘క్వాంటం కారిడార్’

Advertisement

మరోవైపు అమరావతి రీజియన్‌లో రూ. 4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఆక్వాకల్చర్, కోకో, పామాయిల్ సాగు ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి చోదకశక్తులుగా నిలుస్తాయన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన రవాణా అనుసంధానం, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు క్వాంటం వ్యాలీ, తయారీ రంగాల ఆధారంగా ఏర్పాటు చేయనున్న ‘క్వాంటం కారిడార్’ అమరావతి అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో భూముల రీ-సర్వేకు రంగం సిద్ధం.. రైతులకు కీలక సూచనలు జారీ!

చిన్నతరహా పరిశ్రమల అనుసంధానం

భారీ పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, సేవలను అందించే విధంగా స్థానిక ఎంఎస్ఎంఈలను (MSME) సప్లై చైన్‌లో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి.. ముఖ్యంగా రేర్-ఎర్త్ వ్యర్థాల నుంచి విలువైన ముడిసరుకులను వెలికితీసే మార్గాలను అన్వేషించాలన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా రంగాల మధ్య సమన్వయం కోసం తిరుపతి రీజియన్‌కు ఐఐటీ, అమరావతికి బిట్స్ పిలానీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను నాలెడ్జ్ పార్ట్‌నర్లుగా చేసుకోవాలని తెలిపారు.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్..వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌ అంతే!

Tags

Related News

ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ

బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..

రూ.7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ!

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

అక్వాన్ తుఫాన్ తీరం దాటిందో‌చ్.. ఏపీకి పెద్ద గండం తప్పింది, కుమ్మేస్తున్న భారీ వర్షాలు

‘బిగ్‌ టీవీ’ ముందే చెప్పింది.. జెడ్పీ పీఠాలపై లిస్టు ఇదిగో, ఎవరు ఎక్కడెక్కడంటే..

Big Stories

Advertisement
×