E-Paper
Advertisement

చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం

చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం
Advertisement

AI Misuse: స్వేచ్ఛ బ్యూరో: కృత్రిమ మేధ దుర్వినియోగం జరుగుతున్న తీరు, సినీనటులు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత ఆధారంగా.. ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిచే ప్రయత్నాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వివరించారు.

షాకు లేఖ ఇచ్చిన కిషన్ రెడ్డి

Advertisement

ఈ నేపథ్యంలో తాజాగా కృత్రిమ మేధ దుర్వినియోగం, మార్ఫింగ్, డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్ వంటి చర్యలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ.. అమిత్ షా కు చిరంజీవి రాసిన లేఖను కిషన్ రెడ్డి అందజేశారు. కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా పనిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా వ్యక్తుల హక్కులు, వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కఠిన చర్యల కోసం ప్రత్యేక చట్టం..

Advertisement

ఈ విషయంలో కఠిన చర్యలకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుందని వెల్లడించారు. అమిత్ షా కు చిరంజీవి రాసిన లేఖలో.. కృత్రిమ మేధ దుర్వినియోగం కారణంగా సినీ కళాకారులు, ఫిల్మ్, టెలివిజన్ పరిశ్రమల్లోని వ్యక్తులకు జరుగుతున్న నష్టం గురించి వివరించి వీటిని అరికట్టాలని కోరారు. ఈ విషయంపై అమిత్ షా సానుకూలంగా స్పందించారన్నారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన విధానాలు, నియంత్రణలు రూపొందించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 Also Read: అక్రమ అండాల కేసులో హైకోర్టు సీరియస్.. ఐవీఎఫ్ కేంద్రాల తీరుపై తీవ్ర ఆగ్రహం

Tags

Related News

‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక అసలు కథ.. టీమ్ ఆన్సర్స్ వింటే నవ్వాల్సిందే!

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?

సుడిగాలి సుధీర్‌తో మళ్లీ సినిమా చేయను.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?

ఇదెక్కడి ఫ్యాషన్ గురూ.. పాత చీరలతో భూమి చేసిన ప్రయోగం వైరల్!

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. ఎవరు పుట్టారంటే?

Big Stories

Advertisement
×