E-Paper
Advertisement

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?

ఫోన్ స్విచ్ఛాఫ్.. బ్లాక్‌మెయిలింగ్.. గోట్ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది?
Advertisement

GOAT Movie Controversy:సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా ఈనెల 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ దీని చుట్టూ కాంట్రవర్సీలు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాయి.

మాములుగా ఏ సినిమా రిలీజ్ అయినా సినిమా కలెక్షన్స్ ఎంత,సినిమా ఆడుతుందా, అసలు థియేటర్ లో పరిస్థితి ఏంటి అంటూ డిబేట్లు జరుగుతుంటాయి.కాని విచిత్రంగా ఈ సినిమా ఎందుకు లేట్ గా రిలీజ్ అయింది. హీరోకి,నిర్మాతకి మధ్య గొడవలేమైనా జరిగాయా అనే విషయాలే ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.ఈ క్రమంలో సినిమా నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే

చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఊర్లల్లో యూత్ బెట్టింగ్‌లు, మందు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే ఒక మంచి మెసేజ్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నామని చెప్పారు.ఇక కేవలం సుధీర్ ని కామెడీ రోల్స్ కి పరిమితం చేయకుండా అతడిలోని మంచి నటుడిని బయటకి తీయాలనే ఉద్దేశంతో ఒక కొత్త స్టోరీతో సినిమా చేశానని తెలిపారు.

Advertisement

అయితే ఈ సినిమా కథని మొదట్లో డైరెక్టర్ కేవలం 20 నిమిషాల పాటే చెప్పాడని,ఇక నెలలు గడుస్తున్నా పూర్తి స్క్రిప్ట్ రెడీ ఇవ్వలేకపోయారని, ఆ టైంలో సుధీర్ కూడా టీవీ షోలు పక్కన పెట్టి ఈ సినిమా కోసం వెయిట్ చేశారని చెప్పుకొచ్చారు.ఇక కథ పూర్తిగా రెడీ కాకపోయినా కొన్ని సీన్లతో షూటింగ్ మొదలుపెట్టారని అయితే 20 నుంచి 30 శాతం షూటింగ్ పూర్తయ్యాక అసలు సమస్యలు మొదలయ్యాయని వాపోయారు చంద్రశేఖర్ రెడ్డి .

కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం వల్లే 

టీమ్‌లో టైమ్ సెన్స్,ప్రొఫెషనలిజం లేకపోవడం కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం, మిగతా ఆర్టిస్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి షూటింగ్ ఆపడం లాంటివి జరిగాయని చెప్పారు. ఎన్నిసార్లు కూర్చుని మాట్లాడినా మార్పు రాకపోవడంతో, పాత టీమ్‌ని పక్కన పెట్టి కథను మళ్లీ రాయించి సినిమా పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు

ఇక బడ్జెట్ గురించి మాట్లాడుతూ మొదట్లో ఈ సినిమా బడ్జెట్ మూడున్నర నుంచి నాలుగు కోట్లలో సినిమా అయిపోతుందని అనుకున్నామని కానీ షూటింగ్ మొదలవ్వకముందే బడ్జెట ఐదున్నర కోట్లకు చేరాయని వాపోయారు. సినిమా సగం కూడా కాకముందే బడ్జెట్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఖర్చులు పెరిగిపోతే ఆ భారం టికెట్ రేట్ల రూపంలో ప్రేక్షకుల మీదే పడుతుందని, తనకు అలా చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారో

ఇకసుధీర్ గురించి మాట్లాడుతూ, ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, ఆయనపై మంచి అభిప్రాయం ఉందని చెప్పారు. షూటింగ్ సమస్యల గురించి సుధీర్‌కి ముందే చెప్పానని, కానీ ఆయన ఎందుకు తన వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకోలేకపోయారో తెలియదని అన్నారు.

ఇక సుధీర్ తన కోసం సినిమాకి మరింత డబ్బు ఖర్చు పెట్టాలని అడిగారని, కానీ నిర్మాతకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని స్పష్టం చేశానని తెలిపారు.ఇక ఈ గొడవల వల్ల ఫిల్మ్ ఛాంబర్ పెద్దల దాకా పంచాయితీ వెళ్లి, సినిమా ఏడాదిన్నర ఆలస్యమైందని చెప్పారు.

అంతే కాకుండా ఈ సినిమాపై ఆధారపడ్డ కొత్తవాళ్ళు , టెక్నీషియన్ల భవిష్యత్తు ..ఇలా నడరి కోసం ఎలాగోలా కష్టపడి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశానని నిర్మాత వివరించారు.చూడాలి మరి ఇదే విషయం  పై సుధీర్ ఎలా రియాక్ట్ అవుతాడో !

ALSO READ:మాధురి రాథోడ్ మరో సెన్సేషన్.. బండి రాజయ్యతో రచ్చ రచ్చ!

Tags

Related News

సుడిగాలి సుధీర్‌తో మళ్లీ సినిమా చేయను.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?

ఇదెక్కడి ఫ్యాషన్ గురూ.. పాత చీరలతో భూమి చేసిన ప్రయోగం వైరల్!

అంతా నా కర్మ.. అతడిని ఉద్దేశించి నేను పోస్ట్ పెట్టలేదు: రేణూ దేశాయ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత.. ఎవరు పుట్టారంటే?

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×