Bhumi Pednekar:భూమి పెడ్నేకర్ ..బాలీవుడ్‌లో తనకంటూ సాలిడ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇపుడు మరోసారి తనదైన లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈసారి భూమి గ్లామర్ షో గురించి మాత్రమే కాకుండా ఆమె వేసిన కాస్ట్యూమ్ గురించి కూడా జనాలు మాట్లాడటం ఇక్కడ విశేషం.
ఎర్త్‌షాట్ ప్రైజ్ ఈవెంట్ కోసం భూమి పెడ్నేకర్ ఓ క్రేజీ అవుట్‌ఫిట్ వేసింది. మాములుగా ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్ అయినా సెలబ్రిటీలు కాస్ట్‌లీ డ్రెస్సులతో,సరికొత్త డిజైన్ లతో దగ దగ మెరిసిపోవడం మనం చూస్తూనే ఉంటాం.కానీ భూమి మాత్రం అందరిలా కాకుండా డిఫరెంట్‌గా పాతకాలపు చీరలతో డిజైన్ చేసిన స్పెషల్ డ్రెస్‌ను సెలెక్ట్ చేసుకోవడం మెచ్చుకోతగ్గ విషయం.
ఇక ఇదే విషయాన్ని తనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేస్తూ మనచరిత్రను, మన వారసత్వాన్ని గుర్తు చేసే బట్టలు వేసుకోవడం తనకు చాలా ఇష్టమని పాతకాలపు ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బట్టలు, వింటేజ్ సిల్క్ చీరలతో ఈ డ్రెస్‌ను రెడీ చేసినట్లు తెలిపింది.
ముఖ్యంగా ఆమె వేసిన డ్రెస్‌లో ఓల్డ్ కల్చర్ కి , ఇప్పటి మోడ్రన్ ఫ్యాషన్‌కు మంచి బ్యాలెన్స్ కనిపిస్తోందనే చెప్పాలి . ఇక పాత బట్టలకు కొత్త లుక్ ఇవ్వడం ద్వారా వాటి వాల్యూ ఏంటో మరోసారి గుర్తు చేసింది ఈ వెటరన్ భామ.ముఖ్యంగా రీసైకిల్, రీయూజ్, అప్‌సైకిల్ అనే పాయింట్‌ను తన ఫ్యాషన్ ద్వారా చూపించిందనే చెప్పాలి. ఫ్యాషన్ అంటే ఎప్పుడూ కొత్త బట్టలు కొనడం మాత్రమే కాదు.. మన దగ్గర ఉన్న వాటినే సరికొత్తగా రెడీ చేయడం అని తన పోస్టుతో చెప్పకనే చెప్పింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఇక భూమి సినిమాల విషయానికి వస్తే ఈ భామ ఎప్పుడూ సరికొత్త కథలతోనే ఆడియన్స్ ని ఎంటర్ చేసేందుకు ఇష్టపడుతుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ‘దమ్ లగా కే హైషా’ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘బాలా’ లాంటి సినిమాలతో ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది.
ఇక ‘బధాయ్ దో’ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్, ‘భక్షక్’ మూవీలో పోషించిన పాత్ర భూమి కెరీర్‌లో బెస్ట్ అనే చెప్పాలి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేసే నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొత్తంగా సోషల్ మెసేజ్ ని తన సినిమాలో ఎక్కువగా చూసుకునే ఈ భామ తాజాగా పాత బట్టలకి కొత్త అందాన్ని యాడ్ చేసి నెట్టింట షేర్ చేసిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి !
ALSO READ:నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!