E-Paper
Advertisement

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!
Advertisement

Airtel Rs 3999 Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు షార్ట్ టర్మ్, లాంగ్ రన్ పీరియడ్ లో ఎన్నో రకాల ప్లాన్స్ అందుబాటులో ఉంది. వాటిపై ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.3,999 ప్లాన్ పై ఎయిర్ టెల్ బంపరాఫర్ ఇచ్చింది. ఈ వార్షిక ప్లాన్ పై అదనంగా 150GB బల్క్ డేటాను బోనస్ గా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డేటాను 365 రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ రూ.3,999 ప్లాన్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

రూ.3,999 ప్లాన్ వివరాలు..

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు ప్రతీరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిస్తే ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గనుంది. అయితే ఈ ప్లాన్ లో అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులకు అపరిమిత 5G డేటాను సైతం కంపెనీ అందిస్తోంది. అయితే ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) ప్రకారం.. ప్రతి 30 రోజులకు 300GB పరిమితిని కంపెనీ విధించింది.

అపరిమిత కాలింగ్

Advertisement

కాలింగ్ విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, STD వాయిస్ కాల్స్ ను ఫ్రీగా చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా యూజర్లకు లభిస్తాయి. రోజువారీ 100 SMSల పరిమితి దాటిన తర్వాత లోకల్ మెసేజ్‌కు రూ.1, STD మెసేజ్‌కు రూ.1.50 చొప్పున ఎయిర్ టెల్ ఛార్జ్ చేయనుంది.

అడిషనల్ బెనిఫిట్స్..

ఫ్రీ కాల్స్, డేటాతో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను సైతం ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా అందిస్తోంది. సుమారు రూ. 4,000 విలువైన 12 నెలల ‘అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్ లో ఫ్రీగా పొందొచ్చు. అలాగే స్పామ్ కాల్ అలర్ట్స్, OTP బ్యాంకింగ్ మోసాల నుండి రక్షణ కల్పించే ‘ఎయిర్ టెల్ సేఫ్’ సెక్యూరిటీ సేవలు కూడా ఫ్రీగా లభిస్తాయి. అంతేకాకుండా ప్రతి 30 రోజులకు ఒకసారి నచ్చిన కాలర్ ట్యూన్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఈ ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్ అందిస్తోంది.

Advertisement

Also Read: ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

రోజువారీ ఖర్చు ఎంత?

రూ.3,999 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చినందున సగటున రోజుకు రూ. 10.96 భారం యూజర్ పై పడనుంది. పదే పదే నెలవారీ రీఛార్జ్‌ల గోల లేకుండా రోజూ 2.5GB డేటా, బోనస్ 150GB డేటాతో పాటు అపరిమిత 5G ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ వార్షిక ప్లాన్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. తక్కువ ధరలో ఏడాదంతా ఎలాంటి టెన్షన్ లేకుడా కాల్స్ డేటాను వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Tags

Related News

యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

Big Stories

Advertisement
×