E-Paper
Advertisement

Rashmika Mandanna: అత్తతో గద్దర్ అవార్డ్స్ కు హాజరైన రష్మిక.. ఆకట్టుకున్న కొత్త పెళ్లి కూతురు..!

Rashmika Mandanna: అత్తతో గద్దర్ అవార్డ్స్ కు హాజరైన రష్మిక.. ఆకట్టుకున్న కొత్త పెళ్లి కూతురు..!
Advertisement

Rashmika Mandanna: హైదరాబాద్‌లో ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ 2025 కార్యక్రమం.. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ తారలు, ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించినది హీరోయిన్ రష్మిక మందన్న. ముఖ్యంగా ఆమెకు వచ్చిన అవార్డు మాత్రమే కాదు, ఆమె ప్రవర్తన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు ఉత్తమ హీరోయిన్ అవార్డును అందుకుంది. ఈ అవార్డు ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె పెళ్లయిన వెంటనే ఈ అవార్డు అందుకోవడం ఆమె అభిమానులను మరింత ఆనందానికి కురిచేస్తుంది. ఇక ఈ ఈవెంట్ కోసం..సింపుల్‌గా, చీరలో హాజరైన రష్మిక ఎంతో అందంగా కనిపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె లుక్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

Advertisement

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వేడుకకు రష్మిక.. విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రావడం అందరినీ ఆకట్టుకుంది. రష్మిక తన అత్తతో ఈ కార్యక్రమానికి వచ్చింది. ఇక వీళ్లిద్దరు వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఇద్దరిని ఫోటోలు తీయడం ప్రారంభించారు.

భర్తతో కాకుండా అత్తతో..!

Advertisement

ఇద్దరూ కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత.. విజయ్ దేవరకొండ తల్లి.. నవ్వుతూ రష్మికను ఫోటోలు తీయండి అంటూ పక్కకు జరిగింది. ఈ చిన్న సంఘటన అక్కడున్న వారందరికి చాలా క్యూట్‌గా అనిపించింది. ఇలా పెళ్లయిన వెంటనే భర్తతో కాకుండా ఏకంగా అత్తతో వచ్చి అందరిని తెగ ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

ఇక ఆ తర్వాత రష్మిక కూడా ఫోటోగ్రాఫర్లకు మంచి స్టిల్స్ ఇచ్చింది. ఈ సందర్భంలో ఆమె.. విజయ్ దేవరకొండ తల్లి మధ్య ఉన్న స్నేహం అందరిని చాలా ఆకట్టుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

అంతేకాకుండా ఈ అవార్డుల ఫంక్షన్ కి.. నాగచైతన్య.. అతని భార్య శోభిత.. నాగార్జున, అమల కూడా హాజరయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీలతో ఈ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.

ALSO READ: Sobhita: ఉగాది పచ్చడి వండలేదు.. సమంతకు శోభిత పంచ్..?

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×