OTT Movie : రొమాంటిక్ మూవీ లవర్స్ కోసం ఒక సరికొత్త ప్రేమ కథ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమాలో బిగ్ బాస్ మలయాళం విన్నర్ దిల్షా ప్రసన్నన్ హీరోయిన్‌గా నటించడంవిశేషం. ఈ కథ కూడా కేరళలోని ఒక అందమైన సముద్ర తీర గ్రామంలో మొదలవుతుంది. ఒక హార్ట్ టచింగ్ ప్రేమ కథతో మొదలయ్యే ఈ కథ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘కడలోలం స్నేహం’ (Sea Of Love) 2025లో విడుదలైన మలయాళ రొమాంటిక్ సినిమా. సాయి కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా డీపక్ పరంబోల్ (అర్జున్), హీరోయిన్‌గా దిల్షా ప్రసన్నన్ (మీరా)నటించారు. ఈ సినిమా 2025 జులై 18న థియేటర్లలో రిలీజ్ అయింది. 2025 అక్టోబర్ 24 నుంచి మనోరమా మాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అర్జున్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఊరిలో తన కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. అతను జాలరి కుటుంబం నుండి వచ్చినవాడు. కానీ మోడ్రెన్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడతాడు. మరో వైపు మీరా అనే కాలేజ్ విద్యార్థిని, ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంటుంది. ఒక రోజు ఆమె సముద్ర తీరంలో ఫోటోలు తీస్తుండగా, అర్జున్‌తో మీరా అనుకోకుండా కలుస్తుంది. అర్జున్ ఆమె ఫోటోలు చూసి మెచ్చుకుంటాడు. ఇక్కడి నుండి వాళ్ల స్నేహం మొదలవుతుంది. అర్జున్, మీరా తరచూ సముద్ర తీరంలో కలుస్తూ ఉంటారు. ఇక వీళ్ళ ప్రేమ కబుర్లతో మొదలవుతుంది. వీళ్లిద్దరూ సముద్రం ఒడ్డున, చిన్న బోట్ రైడ్స్‌లో రొమాంటిక్ గా సమయం గడుపుతారు.
అయితే వాళ్ల కుటుంబాలు ఈ రిలేషన్‌కి అడ్డంకిగా మారతాయి. అర్జున్ ఫ్యామిలీ తన కులంలోనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటారు. మీరా తండ్రి ఒక స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉద్యోగి. మీరా ఫోటోగ్రఫీ కెరీర్‌ని ఫాలో అవ్వడం వాళ్లకి ఇష్టం ఉండదు. ఆమెకు కూడా ఇంకో అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటారు. అర్జున్, మీరా తమ ప్రేమ గురించి కుటుంబాలకు చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ రెండు కుటుంబాల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది.
Read Also : నగరాన్ని తుడిచిపెట్టే డేంజర్ డిసీజ్… మనుషులను ఆయిల్ లో వేయించి తోలు ఒలిచే సైకోలు… బ్రూటల్ సీన్లు భయ్యా
ఈ సమయంలో ఒక ఊహించని ట్రాజెడీ జరుగుతుంది. మీరాకి ఒక అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఆమె జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఈ విషయం తెలిసిన అర్జున్ షాక్ అవుతాడు. కానీ ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. మీరా మాత్రం అర్జున్ జీవితానికి తను భారం కాకూడదని అనుకుంటుంది. అతన్ని దూరం చేయడానికి ట్రై చేస్తుంది. ఇక ఈ కథ ఒక ఎమోషనల్ జర్నీ లా మారుతుంది. మీరాకి వచ్చిన జబ్బు నయం అవుతుందా ? వీళ్ళ ప్రేమలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయి ? అర్జున్ తన ప్రియురాలి కోసం ఎలాంటి త్యాగాలు చేస్తాడు ? అనే విషయాలను, ఈ మలయాళ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోండి.