Kannappa Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో కన్నప్ప ఒకటి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆ సినిమాలు బాగుంటే బ్రహ్మరథం పడుతున్నారు. అద్భుతమైన కలెక్షన్లు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్ చేసిన సినిమాలు చాలా వచ్చాయి. అయితే మంచి ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా కొంతమంది స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించడం వలన కొద్ది మంది ఈ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అని పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్ర పైన ఆసక్తి ఎక్కువ.
సెకండ్ ఆఫ్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ
ఈ సినిమాలో మొదటి శివుడు పాత్ర కోసం ప్రభాస్ ని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలియగానే, ప్రభాస్ ఏ పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఆ తర్వాత రుద్రా అని పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు అని అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సెకండ్ ఆఫ్ మొదలైన 15 ,20 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల వరకు ప్రభాస్ కనిపిస్తారు అని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ లో కూడా ప్రభాస్ కనిపించలేదు. చాలామంది ఈ సినిమా ఈవెంట్స్ కు ప్రభాస్ వస్తాడు అనే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఎందుకు రాలేదు అని కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. వీటి పైన తాజాగా స్పందించారు మంచు విష్ణు.
ప్రభాస్ రాకపోవడానికి కారణాలు ఇవే
అతనికి ఇబ్బంది ఏం కలుగుతదో నాకు తెలుసు. సో నేను ఇప్పుడు అడగలేదు. ఆయన మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను. నేను అడగట్లేదు నిన్ను గుర్తుపెట్టుకో అని చెప్పాను కూడా, ఆయన వీడియో బయట పంపిస్తాను అని చెప్పినప్పటికీ కూడా, మేము కొన్ని కారణాల వలన వీడియో బైట్ తీసుకోలేదు. అని మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రెస్ మీట్ లో తెలియజేశారు. అలానే ఈ సినిమాలో ప్రభాస్ సీన్స్ దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుందని తెలిపాడు.
Also Read : Kannappa Movie Poll: కన్నప్ప ఎవరి కోసం చూస్తారు? పోల్‌లో షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చిన నెటిజన్స్