BigTV English

Kannappa Movie Poll: కన్నప్ప ఎవరి కోసం చూస్తారు? పోల్‌లో షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చిన నెటిజన్స్

Kannappa Movie Poll: కన్నప్ప ఎవరి కోసం చూస్తారు? పోల్‌లో షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చిన నెటిజన్స్

Kannappa Movie Poll: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల్లో కన్నప్ప ఒకటి. ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎస్.ఎస్ రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమా తీయడం మొదలు పెట్టాడో, అక్కడి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక అడుగు ముందుకు వేసి పాన్ ఇండియా సినిమా చేయడంలో ముందుకు వచ్చింది. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక పాన్ ఇండియా హీరోల ప్రస్తావన వస్తే మొదట ఆ గుర్తింపు సాధించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది.


కన్నప్ప ఎవరికోసం చూస్తారు 

మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలను ప్రేక్షకులు చూడడం మానేశారు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా మిగతా ఇండస్ట్రీలో ఉన్న పెద్దపెద్ద నటులను తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నాడు. సెకండ్ ఆఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే కన్నప్ప సినిమా రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో బిగ్ టీవీ ఒక పోల్ నిర్వహించింది. కన్నప్ప సినిమాను ఎవరికోసం చూస్తారు అనేది ఆ పోల్ సారాంశం.


కన్నప్ప సినిమా చూసేది ఆయన కోసమే 

కన్నప్ప సినిమాను ఎవరికోసం చూస్తారు అనే పోల్ లో దాదాపు 80 శాతం మంది ప్రభాస్ కోసమే చూస్తాము అని ఓట్ చేశారు. ఇది ఒక షాకింగ్ విషయం అని చెప్పొచ్చు. ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండే ప్రభాస్ కోసమే ఇంతమంది చూస్తున్నారు అంటే, ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదు అని చెప్పాలి. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి నటులు కేవలం కొంతమేరకు మాత్రమే ఈ సినిమాను ముందుకు నడిపించారు ఏదేమైనా ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాలో చేయకపోయి ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అంతు చిక్కడం లేదు. ఇప్పటికైనా కూడా ప్రభాస్ సీన్స్ ఆకట్టుకుంటేనే ఈ సినిమాకి భవిష్యత్తు ఉంది అనేది ఒప్పుకోలేని వాస్తవం. లేకపోతే మంచు ఫ్యామిలీ మరో భారీ రిస్క్ లో పడిపోయినట్లే.

Also Read : Coolie Telugu Rights : ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టలేం… కూలీ తెలుగు రైట్స్‌పై దిల్ రాజు

Related News

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Coolie : ఇది రజనీకాంత్ అసలు క్రేజ్, టికెట్లు కొని మరి సినిమాకి పంపిస్తున్నారు

Varsha Bollamma :సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Big Stories

×