BigTV English

BIG TV Kissik talk: డబ్బు కోసమే వాడితో పెళ్లి… తప్పు చేశానా? శుభశ్రీ షాకింగ్ కామెంట్స్

BIG TV Kissik talk: డబ్బు కోసమే వాడితో పెళ్లి… తప్పు చేశానా? శుభశ్రీ షాకింగ్ కామెంట్స్

BIG TV Kissik talk:  బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “కిస్సిక్ టాక్స్” (Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) యాంకర్ గా వ్యవహరిస్తున్నారు . ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి అద్భుతమైన ఆదరణ వస్తుంది. ఇక ప్రతివారం ఒక్కో సెలెబ్రెటీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారితో ఎన్నో విషయాలను ముచ్చటిస్తూ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమానికి శుభశ్రీ రాయగురు(Subha Sree Rayaguru) హాజరయ్యారని తెలుస్తోంది.


సినిమాలపైనే ఆసక్తి..

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈమె కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలోకి శుభశ్రీ రావడంతోనే వర్ష తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. బిగ్ బాస్(Bigg Boss) లో ఛాన్స్ గురించి అడిగితే నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. అలాగే టీవీ షోస్ చేయకపోవడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. తనకు టీవీ అంటే ఇష్టం లేదని కాదు కానీ సినిమాలంటే చాలా ఇష్టమని శుభశ్రీ తెలిపారు.


డబ్బు కోసమే పెళ్లి..

ఇక ఇప్పుడు సినిమాలో అవకాశం ఇచ్చి అందులో లిప్ కిస్ ఉంటే శుభశ్రీ చేస్తుందా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఆమె ఇప్పుడు నేను చెయ్యలేను అంటూ తనకు నిశ్చితార్థం అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఇటీవల ఈమె నిర్మాత, నటుడు అజయ్ మైసూర్(Ajay Mysor) తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. అజయ్ బాగా డబ్బున్నోడని, డబ్బు కోసమే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు చేశారు.

ఇలా నిశ్చితార్థం తర్వాత తన గురించి వచ్చిన విమర్శలపై కూడా వర్ష ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె కాస్త ఘాటుగానే సమాధానం చెప్పారు. డబ్బు చూసి నేను అతనిని పెళ్లి చేసుకోలేదని, అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ రియాక్ట్ అయ్యారు. అలాగే ఈ ట్రోల్స్ చూసి తాను చాలా బాధపడినట్లు కూడా తెలిపారు. ఇలా నన్ను టార్గెట్ చేయడంతో తప్పు చేశానా అనే భావన కూడా కలుగుతుంది అంటూ శుభశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనంతరం ఈ కార్యక్రమంలోని తనకు కాబోయే భర్త అజయ్ కి ఫోన్ చేసి కూడా వర్ష శుభ శ్రీ ఇద్దరు మాట్లాడారు. మీ గురించి ఇన్ని ట్రోల్స్ వచ్చిన మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఎలా సాధ్యం అంటూ వర్షా ప్రశ్నించడంతో తాను కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమా చేసినప్పుడే ట్రోల్స్ ఎదుర్కొన్నానని, తనకు అలవాటైపోయిందనే విధంగా అజయ్ సమాధానం చెప్పారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని విడుదల చేసిన ప్రోమో చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ లో ప్రసారం కానుంది.

Also Read: Actress Samantha: అతని ఇల్లు.. అతని రూల్స్.. సమంత కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×