Rekha vedavyas:ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలను తమ అందంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ సడన్గా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇక వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే సడన్గా మళ్లీ మన ముందుకు వచ్చి అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో రేఖ వేదవ్యాస్ (Rekha vedavyas)కూడా ఒకరు. ‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను 2001లో పలకరించిన ఈమె.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం..పెళ్లికి రండి , ఒకటో నెంబర్ కుర్రాడు ఇలా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్..
ఇక తెలుగు ఇండస్ట్రీకి దూరమైనా.. కన్నడలో పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈమె.. 2014లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక షోలో కనిపించిన ఈమె గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయి కనిపించి, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్లు చెప్పిన ఈమె ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణం చెప్పుకొచ్చింది. 2014 తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను.
ఆ వ్యాధి కారణంగానే ఇండస్ట్రీకి దూరమయ్యా – రేఖ
షో లో భాగంగా రేఖ మాట్లాడుతూ .. “ఒకానొక సమయంలో అనారోగ్యానికి కూడా గురయ్యాను. అటు మానసికంగా, శారీరకంగా ఆ వ్యాధితో బాధపడ్డాను. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. లక్షల రూపాయలు ధారపోసాను. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత సులభం కాదు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి అయినా నేను మళ్ళీ సినిమాలు చేయాల్సిందే. అటు సినిమాలే కాదు యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టులో నైనా నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది రేఖ వేద వ్యాస్. ఇకపోతే తనకు అనారోగ్య సమస్య ఉంది అని చెప్పింది. కానీ తనకు వచ్చిన వ్యాధి ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా తన బాధలను బయటకు చెప్పకపోవడమే మంచిదని అందుకే తనకొచ్చిన వ్యాధి గురించి తాను ప్రస్తావించడం లేదు అంటూ కూడా తెలిపింది రేఖ వేదవ్యాస్.
అందుకే పెళ్లి చేసుకోలేదు..
ఇకపోతే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఒకటే అంటూ పెళ్లి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. ఇక నేను లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి నాకు దొరకాలి. ఇక సరైన వ్యక్తి దొరికే వరకు నేను వైవాహిక బంధం లోకి అడుగుపెట్టను. అంటూ తాను పెళ్లి చేసుకోకపోవడంపై స్పందించింది రేఖ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రీ ఎంట్రీ కి సిద్ధం..
ఇకపోతే ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న ఈ బ్యూటీకి సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇస్తారా లేక మెయిన్ హీరోయిన్ గానే అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తానని చెబుతున్న రేఖా కి ఇండస్ట్రీలో అవకాశం ఎవరు కల్పిస్తారో చూడాలి.