Weather Update: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి, 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, వాగుల, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల మీద వరద పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఇటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా చింతలగూడెంలో సుడిగుండం ఒక్క సారిగా బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భారీ వర్షాం కురుస్తున్న నేపథ్యంలో సడెన్‌గా సుడిగుండం విరుచుకుపడింది. దీని ప్రభావం వల్ల మూడ ఇళ్లు పూర్తిగా, 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు మేకలు చనిపోయాయి, గేద దగ్గర పాలు తాగుతున్న లేగ దూడ గాల్లోకి ఎగిరింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గ్రామస్థుల ఉండిపోయారు. విద్యుత్ ఆగిపోయి వర్షాంలో తీవ్ర ఇబ్బందుల ఎదుర్కున్నారు.
Also Read: ఎంటర్ ద డ్రోన్ మిస్సైల్.. స్పెషాల్టీ ఏంటి?
ఉప్పొంగుతున్న గోదావరి..
వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయాం నుంచి నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. లక్షా 20వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతోంది. 32వేల 638క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం 580.20 అడుగులకు నీటి మట్టం చేరింది. 283. 5924 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జూరాలలో వరద కొనసాగుతుండటంతో ఐదు గేట్లు ఎత్తి 95వేల 416 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 317.390మీటర్ల నీటి మట్టం,7.444 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 3 లక్షల 41 వేల క్యూసెక్కులుగా ఉంది. 85గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 8.700 మీటర్లుగా ఉంది. సరస్వతి ఘాట్, మెయిన్ పుష్కరఘాట్లను వరద ప్రవాహం తాకుతోంది.
5 రోజుల నుంచి ఖమ్మంలో విస్తారంగా వర్షాలు
ఖమ్మంలో ఐదు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే వరద ముప్పు లేదన్నారు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి. వరదను అంచనా వేస్తూ NDRF, SDRF టీంల నుంచి 24 మంది చొప్పున మొత్తం 48 మందిని, 8 బోట్లను సిద్ధం చేశామన్నారు. మహబూబాబాద్ నంచి చెరువుల మ్యాపింగ్ ఏర్పాటు చేశామన్నారు. వరద వచ్చినా… రెండు గంటల ముందే తెలుస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు.