Mahesh Babu – Sukumar: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli )డైరెక్షన్లో ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే మూవీ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రాజమౌళి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) మూవీ 2027లో విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పటి వరకు మహేష్ బాబు మరో సినిమాకి కమిట్ అవ్వరు.. ఈ సినిమా తర్వాతనే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ఆలోచన చేస్తారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ లో ఒక క్రేజీ బజ్ వినిపిస్తోంది. అదేంటంటే మహేష్ బాబు – సుకుమార్(Sukumar) కాంబోలో సినిమా. ఈ కాంబో ఊహించుకోవడానికే చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
ఆరేళ్ల తర్వాత మహేష్ బాబుతో సుకుమార్ సినిమా..
అయితే ఇప్పటికే మహేష్ – సుకుమార్ కాంబోలో 1 నేనొక్కడినే (1 Nenokkadine) సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ కాకపోయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం మంచి హిట్ అయింది. ఈ సినిమాని ఇప్పటికీ కూడా చాలామంది ఇష్టంగా చూస్తారు.అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో సినిమా అనుకున్నప్పటికీ కుదరలేదు. ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు.
ఈయన వరుసగా రామ్ చరణ్ (Ram Charan), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)లతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరితో సినిమాలు అయ్యాక అల్లు అర్జున్ తో మళ్ళీ పుష్ప-3 (Pushpa-3) చేయబోతున్నట్టు టాక్. అయితే ఈ సినిమాల తర్వాత మహేష్ బాబుతో కూడా సుకుమార్ ఓ సినిమా చేయాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు కూడా రాజమౌళి తర్వాత చేయబోయే సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఇవ్వడం లేదు.
మరో ఆరేళ్ల వరకు ఈ కాంబో లేనట్టేనా..?
కానీ మహేష్ బాబు నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో సినిమా చేయబోతున్నట్టు రూమర్ అయితే వినిపిస్తోంది. అలా రాజమౌళి,సందీప్ రెడ్డి వంగాల సినిమాల కోసం దాదాపు 6,7 సంవత్సరాల టైం పడుతుంది.ఇటు సుకుమార్ కూడా ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు పూర్తి చేయాలంటే కచ్చితంగా 6,7 సంవత్సరాల టైం పడుతుంది.. 1 నేనొక్కడినే సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో మరో సినిమా చేద్దామని అనుకున్నారట. కానీ అప్పటికి ఆ ప్రాజెక్టు సెట్ అవ్వకపోవడంతో వదిలేసారట.
మరి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఈ రూమర్ నిజమయ్యేనా.. మళ్లీ సుకుమార్ , మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తే కథ పరంగా.. కమర్షియల్ పరంగా వర్కౌట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు అభిమానులైతే సుకుమార్ తో సినిమా చేయలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య సుకుమార్ చేసే సినిమాలన్ని బ్లాక్ బస్టర్సే.. అందుకే రాజమౌళి సినిమా తర్వాత సుకుమార్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి వీరి కాంబో వర్కౌట్ అవుతుందా లేదా అనేది.
ALSO READ:Jailer 2 Update : రజినీ vs షారుక్… ఇదేంటి అసలు ? కాస్త హద్దు పద్దు ఉండాలి కదా ?