Hotel For Cheap| ఒక భారతీయుడు ఇతర దేశంలో పర్యటనకు వెళ్లి హోటల్ స్టే కోసం తన బడ్జెట్‌లో వెతుకుతుండగా.. అక్కడ అతనికి ఊహించని ధరలో హోటల్ గది లభించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోగా.. అందరూ షాక్ కు గురయ్యారు. అతను ఒక రూమ్‌ను కేవలం ₹159.02కి బుక్ చేసుకున్నాడు.. పైగా అందులోనే అన్ని పన్నులు కలిపి ఉన్నాయని తెలిసి మరింత ఉలిక్కి పడ్డారు. ఆ ట్రావెలర్ ఈ సమాచారాన్ని తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. తను రాసిన పోస్ట్‌లో హోటల్ లిస్టింగ్, ఫైనల్ ప్రైస్ స్క్రీన్‌షాట్‌లతో సహా పెట్టాడు. ఇప్పుడు దీని గురించే ఆన్‌లైన్‌లో చర్చ ఊపందుకుంది.
ఆ ట్రావెలర్ ఈ బుకింగ్.. వియత్నంలోని లీఫ్ హోటల్ ఫూ కువాక్‌లో చేసుకున్నాడు. ఇంత తక్కువ ధర ఉండడమే కాకుండా.. ఈ రూమ్ సుపీరియర్ డబుల్ లేదా ట్విన్ రూమ్‌గా ఉంది. ఇందులో ఉచిత Wi-Fi, పార్కింగ్, 24 గంటల చెక్-ఇన్, సామాను నిల్వ సౌకర్యం, ఒక క్వీన్ సైజ్ బెడ్ లేదా రెండు సింగిల్ బెడ్ లు ఉన్నాయి. లిస్టింగ్ ప్రకారం.. 18 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ రూమ్ ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది.
ఆ ట్రావెలర్ పోస్ట్‌లోని వివరాలు పరిశీలిస్తే.. ఆ హోటల్ ప్రైసింగ్ , అతనికి దక్కిన ఆఫర్లు మతి పోగొట్టేలా ఉన్నాయి. ఒక రాత్రి కోసం ప్రారంభ ధర ₹578.24గా ఉంది. కానీ 75 శాతం డిస్కౌంట్‌తో ధర ₹144.56కి తగ్గింది. దానికి పన్నులు, ఫీజులు ₹14.46 మాత్రమే యాడస్ చేసి ఫైనల్ ధర ₹159.02గా నిర్ధారణ అయ్యింది. ఈ బుకింగ్ స్థానిక కరెన్సీ 48,000 వియత్నామీస్ డాంగ్‌లో చెల్లించాల్సి ఉంటుందని, అందులో అన్ని VATలు చేరినవని ప్లాట్‌ఫాం తెలిపింది. ఈ ధర వివరాలు చూసిన నెటిజెన్లు ఈ పోస్ట్ ని విపరీతంగా షేర్ చేయడంతో ఇప్పుడిది బాగా వైరల్ అవుతోంది.
ఈ తక్కువ ధరను చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ పర్యాటకుడి అదృష్టమని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఇది అతను చేసిన ట్రిక్ అని అభిప్రాయపడుతున్నారు.
ఈ పోస్ట్ చూసి కామెంట్ చేసిన వారిలో ఒక యూజర్ ఇలా రాశాడు. “ఈ పోస్ట్ నేను మళ్లీ మళ్లీ చెక్ చేశాను, చాలా వింతగా ఉంది, 159 – 28.62 OTA కమిషన్ = 130.38 టాక్స్‌లతో, ఇది రూమ్ ఆపరేషన్స్ ఖర్చులను సహించడానికి సాధ్యం కాదు, ఇది రెవెన్యూ మేనేజ్‌మెంట్ లోనే తప్పు లేదా ఇతర హోటళ్ళ వల్ల కలిగే పోటీ సమస్య వల్ల తాత్కాలిక ఆఫర్ కావచ్చు. నిజమేంటో సమయం చూపిస్తుంది.” అని కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ అయితే.. “ఇది ప్రాపర్టీలో చెల్లింపు బుకింగ్, ఈ ధరకు చెక్-ఇన్‌ను నిరాకరించే అవకాశం ఎక్కువ.” అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరొకరైతే.. “ఈ మాత్రం రేటుకి ఒక కప్పు కాఫీ కూడా దొరకదు,” అని రాశాడు.
మంచి ఆఫర్లతో అందుబాటులో ఉన్నఈ అద్భుతమైన బుకింగ్ చేసుకున్న భారతీయ పర్యాటకుడి ఆలోచనాశక్తిని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే, కొంతమంది ఈ ధర నిజమైనదా లేదా అతను తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు అని సందేహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఈ సంఘటన ప్రయాణికుల్లో సహేతుకమైన ఆసక్తిని రేకెత్తించింది. వియత్నాం వంటి ప్రదేశాల్లో తక్కువ ధరలకు మంచి సౌకర్యాలు లభిస్తాయని చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఈ రకమైన డిస్కౌంట్‌లు అన్ని వేళలా లభించవని.. ఈ పర్యాటకుడు ఎంతో అదృష్టవంతుడని అంటున్నారు.
Also Read: చనిపోయిన విష సర్పం..మనిషిని కాటేసిన 5 నిమిషాల్లోనే.. అతడి రక్తంలో ఏముందంటే
ఈ హోటల్ కారణంగా ఇప్పుడు ప్రయాణికులు ఆన్‌లైన్ డీల్స్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సమయాన్ని గమనించి, గొప్ప అవకాశాలను సొంతం చేసుకోవచ్చని అర్థమవుతోంది. అయితే, కొంతమంది హోటల్ నిర్వాహకులు ఈ తక్కువ ధరను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, బుకింగ్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.