STR49 : కొన్ని కాంబినేషన్స్ వింటుంటేనే ఒక హై క్రియేట్ అవుతుంది. కొన్ని కాంపినేషన్స్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగులో అలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా తమిళ్లో కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో వెట్రి మారన్ దర్శకత్వంలో శింబు సినిమా చేయడం కూడా ఒకటి.
శింబు తన కెరియర్ లో ఇప్పటివరకు 48 సినిమాలు పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం శింబు చేయబోయే 48వ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పటినుంచో సినిమా వస్తుంది అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలే ఈరోజు నిజమయ్యాయి.
ఈ కాంబినేషన్లో సినిమా గురించి చాలా మంది తమిళ్ ప్రేక్షకులతో పాటు కొంతమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు వెట్రి సినిమాలను చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా వీక్షించారు. ఎన్టీఆర్ లాంటి హీరో వెట్రి మారన్ తో సినిమా చేయాలి అని పలు సందర్భాలలో కూడా తెలియజేశారు. అయితే శింబు చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రోమో అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుద్ రవి చందర్ సంగీతం అని అనుకుంటున్నారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో శింబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. శింబు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా మందికి ఇన్స్పైరింగ్ అని చెప్పాలి.
వాస్తవానికి వెట్రి మారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన వడా చెన్నై సినిమాను మొదటి శింబుతో ప్లాన్ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఆ సినిమాలో ఉన్న కొన్ని పాత్రలు ఇప్పుడు శింబు తో చేయబోయే సినిమాలో ఉండబోతున్నాయి అని మరోవైపు సమాచారం కూడా వినిపిస్తుంది. అదే నేపథ్యంలో కూడా ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.
యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఆండ్రియా జెర్మియా, సముతీరా ఖని వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే శింబు హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన సక్సెస్ శింబు కు పడలేదు. మానాడు సినిమా కూడా థియేటర్లో కాకుండా డైరెక్ట్ ఓటిటి లో విడుదల అయింది.
Also Read: Dulquer Salmaan : కేరళ హైకోర్టుకు వెళ్లిన దుల్కర్ సల్మాన్, కస్టమ్స్ అధికారులకు సవాల్