Rishabh shetty: రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ పేరు కన్నడ ఇండస్ట్రీతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్మోగుతుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది .ప్రతి ఒక్క చోట ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా థియేటర్లో చూసిన కొంతమంది ప్రేక్షకులు అక్కడ వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా నటుడు రిషబ్ శెట్టి (Rishabh shetty)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను అభిమానులను అభ్యర్థిస్తూ.. ప్రియమైన అభిమానులు ప్రేక్షకులకు మనవి. కాంతార చాప్టర్ 1 సినిమా మాది మాత్రమే కాదు మీది కూడా. ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరుపు రానిది. అయితే కొంతమంది ఈ సినిమాని థియేటర్లలో రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
దయచేసి ఎవరు కూడా ఇలా సినిమాని రికార్డ్ చేస్తూ వీడియోలు తీయొద్దని అలాగే పైరసీని ప్రోత్సహించవద్దని సవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాంతార వంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో చూసి ఆ అనుభూతిని పొందండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ అభిమానులను అభ్యర్థిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా పైరసీ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి పైరసీని అరికట్టడం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.
Dear #Kantara Family and Cinema Lovers,#KantaraChapter1 is as much yours as ours, and your love has made it truly unforgettable.
We humbly request you not to share/record videos from the film and not to encourage piracy.
Let’s keep the magic of Kantara alive in theatres, so… pic.twitter.com/EluTsYZspE— Rishab Shetty (@shetty_rishab) October 3, 2025
ఇలా థియేటర్లలో సినిమాలను రికార్డు చేయడం వల్లే పైరసీలు కూడా జరుగుతున్నాయని వాటిని ప్రోత్సహించవద్దు అంటూ ఈ సందర్భంగా రిషబ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటించగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంభళే ఫిలిమ్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం సుమారు 125 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ఇక కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల రిషబ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
Also Read: Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?