UoH Jobs 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 52 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులు అక్టోబర్ 24లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్ సైట్ https://uohyd.ac.in/careers-uoh/ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ లో రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ ఏ,బీ,సీ,డీ కేటగిరిలో పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ, నిర్దిష్ట విభాగాలలో బీ.టెక్/ బీఈ, ఎం.టెక్/ ఎంఈ, ఎం.ఫిల్/ పీహెచ్‌డీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వంటి అర్హతలను కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు యూజీసీ నెట్, టీజీ సెట్ అర్హతతో పని అనుభవం ఉండాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ(పోస్టును బట్టి) ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. అర్హులైన వారు 24 అక్టోబర్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 1,000 చెల్లించాలి.
పూర్తి వివరాలు, ఆయా పోస్టులకు అర్హతలు, దరఖాస్తు లింక్ కోసం అభ్యర్థులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ uohyd.ac.in ను సందర్శించవచ్చు.