Indian Movie’s: సాధారణంగా ఒక సినిమా విడుదల అయ్యింది అంటే ఆ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల చేసి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాలలో ఉండే మన ఇండియన్ ప్రేక్షకులకు కూడా మన సినిమాలు అందించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విదేశాలలో కూడా చిత్రాలను ప్రదర్శిస్తూ భారీగా లాభాలను కూడా పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఇండియన్ చిత్రాలకు ఇప్పుడు విదేశాలలో భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దాడులు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండియన్ సినిమాల ప్రదర్శనను రద్దు చేసిన కెనడా..
ప్రస్తుతం వరుస దాడులు కెనడాలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక థియేటర్లో ఇండియన్ సినిమాలను నిలిపివేశారు. భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని.. అందుకే వాటి ప్రదర్శనను రద్దు చేస్తున్నామని కూడా థియేటర్ యాజమాన్యం చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కెనడాలోని ఓక్ విల్లే ప్రాంతంలో ఫిల్మ్. కా అనే థియేటర్లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండుసార్లు దాడులు జరిగాయి. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శనను ఆ థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సినిమాలలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ చిత్రంతోపాటు రిషబ్ శెట్టి(Rishabh Shetty) కాంతార చాప్టర్ 1 సినిమా కూడా ఉండడంతో వాటిని కూడా ఇప్పుడు ప్రదర్శించడం లేదని థియేటర్ యాజమాన్యం తెలిపింది.
రిషబ్ శెట్టి , పవన్ కళ్యాణ్ లకు భారీ షాక్..
ఇద్దరు హీరోలకు ఈ విషయం భారీ షాక్ కలిగించింది అని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను పక్కన పెడితే.. కాంతార చాప్టర్ 1 ఇంకా నిన్ననే విడుదల అయింది. అలాంటి సినిమా ఇప్పుడు ప్రదర్శన ఆగిపోవడంతో వసూళ్లపై దెబ్బ పడే అవకాశం ఉందని పలువురు సినీ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Film industry:నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. ఏకంగా అంతరిక్షంలో పెళ్లి!
ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్నప్పుడే దాడులు..
ఇకపోతే తాజాగా జరిగిన దాడులపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే.. సెప్టెంబర్ 25న మొదటిసారి దాడి జరిగింది. ఓజీ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో ఇద్దరు అనుమానితులు థియేటర్ కి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్దగా నష్టం జరగలేదు. ఇప్పుడు అక్టోబర్ 2న మరో దాడి జరిగింది. తెల్లవారుజాము ప్రాంతంలో ఒక అనుమానితుడు కాంతార చాప్టర్ 1 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద కాల్పులు జరిపాడు. ఈ రెండు దాడులు కూడా ఇండియన్ సినిమాలు ప్రదర్శితమవుతున్నప్పుడే జరగడంతో ఇండియన్ సినిమాల ప్రదర్శన రద్దు చేసినట్లు తెలిపారు.
ఆ ఉగ్రవాదుల హస్తం ఉంది -కెనడా థియేటర్ యాజమాన్యం
ఇకపోతే ఈ దాడుల వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. కానీ పోలీసులు మాత్రం దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు వాంకోవర్ లోని భారత్ కాన్సులేట్ ను సీజ్ చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.. అందుకే ఈ థియేటర్ వరుస దాడుల వెనక కూడా వారి హస్తము ఉండవచ్చు అని భావిస్తున్నారు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే నిజాలు బయటపెడతామని స్పష్టం చేశారు