RK Roja:సాధారణంగా సినీ సెలబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటే.. ఇక్కడ ఒక సీనియర్ హీరోయిన్ వారసురాలు మాత్రం తనకు నచ్చిన విభాగంలో సత్తా చాటుతూ అవార్డులు అందుకుంటూ తన టాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా (Roja) కూతురు అన్షు మాలిక (Anshu Malika). చిన్నప్పటి నుంచే చాలా టాలెంట్ తో అనేక విజయాలు సాధిస్తున్న ఈ అమ్మాయి ఇప్పటికే రచయిత్రిగా కూడా పుస్తకాలు రాసి మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈమె అమెరికాలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ తన చదువును కొనసాగిస్తూనే.. ఇలా ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన కెరియర్ ను అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇకపోతే అలాంటి ఈమె ప్రతిభను గుర్తించిన అమెరికా బ్లూమింగ్ టన్ ఇండియానా వర్సిటీ ఈమెకు ఒక అవార్డును అందించింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అన్షు ఈ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతోంది. తాజాగా ఈమెకు ప్రతిష్టాత్మకమైన “మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025 -2026” అందుకుంది. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్ టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అలా ఈ సంవత్సరం రోజా కూతురు ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ విషయం తెలియడంతో అన్షు మాలికాపై రోజా అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Mahavatar Narasimha: మరో 2గంటల్లో ఓటీటీలోకి రానున్న మహావతార్ నరసింహ!
ఆ అంశాలపై పరిశోధన..
అసలు విషయంలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి.. వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, భారత్, నైజీరియా, నమీబియా లాంటి దేశాలలో వెనుకబడిన వర్గాలలో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడమే కాకుండా మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేద వర్గాలకు సాంకేతిక విద్యను అందించడం, ఇలాంటి అంశాలపై పరిశోధన.. వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డు ఇచ్చినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసిన అన్షు..
ఇకపోతే ఈ విషయం అక్కడి న్యూస్ లో వైరల్ అవడంతో ఆ విషయాన్ని అన్షు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ తన సంతోషాన్ని అందరికీ షేర్ చేసింది. లోకల్ మీడియా తన గురించి రాసినట్టు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచింది అన్షు. ప్రస్తుతం అన్షు పై ప్రశంసల వర్షం కురుస్తోంది అని చెప్పవచ్చు.
రోజా కెరియర్..
రోజా కెరియర్ విషయానికి వస్తే.. తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈమె.. స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్న రోజా రాజకీయంగా కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పుడు డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది.