Mahavatar Narasimha: మహావతార్ నరసింహ (Mahavatar Narasimha) చిన్నపిల్లలను మొదలుకొని పెద్దల వరకు ఊహించని రేంజ్ లో ఆకట్టుకున్న చిత్రం అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ భాష యానిమేటెడ్ పౌరాణిక యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ (Ashwin Kumar) దర్శకత్వం వహించారు జయపూర్ణ దాస్ రచయితగా వ్యవహరించగా.. క్లీమ్ ప్రొడక్షన్స్ , హోం బలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రాక్షసుడు, హిరణ్యకశిపుని కథను చూపిస్తుంది. భారీ అంచనాల మధ్య జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. 200కు పైగా థియేటర్లలో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది. అంతేకాదు రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఇప్పటివరకు రూ.340 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది ఈ సినిమా. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. మరో రెండు గంటల్లో అంటే సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అటు థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ యానిమేషన్ మూవీ డిజిటల్ స్క్రీన్స్ పై కూడా ట్రెండ్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరో రెండు గంటల్లో మహావతార నరసింహ మూవీని ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
మహావతార్ నరసింహ సినిమా రివ్యూ..
మహావతార్ నరసింహ సినిమా రివ్యూ విషయానికి వస్తే.. దితి, కశ్యప జంట కలయిక.. హిరణ్యకశిప, హిరణ్యాక్షుల జననం నుంచి ఈ సినిమా మొదలవుతుంది. వాళ్ళు ఏ కారణాలతో రాక్షసులుగా జన్మించారు? ఆ ఇద్దరి రాక్షస స్వభావం ఎలాంటిదో చూపెడుతూ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. ఈ సినిమా భూదేవిని చెరపట్టిన హిరణ్యాక్షుడిని, విష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించడం మొదలుకొని ఈ సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది. అటు హిరణ్యకశిప తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందడం , ప్రహ్లాదుడి జననం, అతడికి వాసుదేవుడి పైన ఉన్న అపారమైన భక్తి తదితర సన్నివేశాలు ప్రధమార్ధంలో చాలా కీలకంగా అనిపిస్తాయి. ఇక ప్రధమార్ధంలో వరాహ అవతారానికి పదింతలు అన్నట్టుగా నరసింహవతారాన్ని చాలా అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఇందులో నరసింహుడికి హిరణ్యకశిపడికి మధ్య జరిగే యుద్ధం కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా ఒక విజువల్ గ్రాండియర్ అని చెప్పవచ్చు. అశ్విన్ కుమార్ స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం మెప్పిస్తుంది. తెలిసిన కథ అయినప్పటికీ చాలా ఆసక్తికరంగా చెప్పడం అభిమానులకు మరింత నచ్చేసింది అని చెప్పవచ్చు.
ALSO READ: Bandla Ganesh: పొగుడుతూనే పొగ పెట్టేసిన బండ్లన్న.. అల్లు అరవింద్ రియాక్షన్!