E-Paper
Advertisement

చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

చిన్న వయసులోనే సాలిడ్ క్రేజ్ .. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

Rohan Roy:రోహన్ రాయ్..తాజాగా సమ్మర్ హాలిడేస్ అనే సినిమాతో పలకరించిన ఈ కుర్రాడు గతంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన సంగతి తెల్సిందే. అందులోనూ ఒకవైపు చదువుతూనే, చిన్న వయసులోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఈ స్థాయికి చేరడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక కేవలం ఐదేళ్ల వయసులోనే డ్రామా జూనియర్స్ షోలో అడుగుపెట్టి దాదాపు ఆరు వందల మంది పిల్లలతో పోటీపడి ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వడం విశేషం.ఇక తాజాగా సమ్మర్ హాలిడేస్ అనే సినిమాతో పలకరించిన ఈ కుర్రాడు తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలని అలాగే తన పారోతోషికం పై ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

Advertisement

రోహన్ మాట్లాడుతూ అప్పట్లో ఓంకార్, అలీ, అనసూయ లాంటి వాళ్ల ముందు ఏమాత్రం భయం లేకుండా పెద్ద పెద్ద డైలాగులు చెప్పానని అలా రామ్ చరణ్ న వినయ విధేయ రామ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్రకు ఎంపికయ్యానని తెలిపాడు.ఇక ఆ షూటింగ్ సమయంలో చరణ్ తన కారును ఆపి మరీ పిలిచి పేరు, చదువు విషయాలు అడిగి ఫోటో దిగడం తన లైఫ్‌లో మర్చిపోలేని మెమరీ అని గుర్తు చేసుకున్నాడు.

అలా కెరీర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుపోతున్న సమయంలో కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల బెంగళూరు, హైదరాబాద్ మధ్య తిరగాల్సి రావడంతో నటనకు గుడ్ బై చెప్పేద్దామని అనుకున్నానని తెలిపాడు.ముఖ్యంగా 90స్ ప్రాజెక్ట్ టైమ్‌లో ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ అయినా, దర్శకుడు ఆదిత్య హాసన్ లాంటి వాళ్ల సపోర్ట్ మరియు మంచి అవకాశాలు రావడంతో మళ్లీ మనసు మార్చుకుని నటనను కంటిన్యూ చేశానని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

ఇక గతంలో షూటింగ్ అంటే కేవలం డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం మాత్రమే అనుకునేవాడినని, కానీ సమ్మర్ హాలిడేస్ సినిమాలో మొత్తం కథ తన పాత్ర చుట్టూనే తిరగడంతో బాధ్యత, సహనం అంటే ఏంటో తెలిసిందని చెప్పుకొచ్చాడు రోహన్. ఎండలో సైకిల్ తొక్కే సీన్లు చేయడం, లైటింగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుల కోసం గంటల తరబడి ఓపికగా ఎదురు చూడటం ద్వారా సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో అర్థమైందన్నాడు.

ఈ సినిమాలో కేవీ అనే పాత్ర కోసం గోదావరి యాసను నేర్చుకుని, షూటింగ్ అయిపోయాక కూడా అదే స్లాంగ్‌లో మాట్లాడేవాడినని ముఖ్యంగా అమ్మకు చీర కొనివ్వడానికి డబ్బులు చేతికి వచ్చినప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్లే సీన్ మరియు తండ్రి అప్పుల వల్ల అమ్మ పడే బాధను తలచుకుని చెప్పే ఎమోషనల్ డైలాగ్ కోసం కెమెరా ఆన్ చేయకముందే కన్నీళ్లు పెట్టుకుని అందులో లీనమైపోయానని ఎమోషనల్ అయ్యాడు.

సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఆడియన్స్ ఏడుస్తూ బయటకు రావడం, ఒక అభిమాని ఏడుస్తూ ఫోన్ చేసి నువ్వు పెద్ద హీరో అవుతావని మెచ్చుకోవడం మర్చిపోలేనని అన్నాడు. తనకు ఇంగ్లీష్‌లో వచ్చే పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ కంటే ఎంతో విలువైనవని తెలిపాడు.ఇక ఎన్టీఆర్ డాన్స్ గ్రేస్ అంటే ఇష్టమని తాను కూడా భరతనాట్యం కూడా నేర్చుకునే ప్రయత్నం చేశానని తెలిపాడు.

ఇక తాను సినిమాకి తెసుకునే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ దాన్ని అసలు పట్టించుకోనని,అదంతా తన తండ్రే చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు.అయితే తనకిరెమ్యునరేషన్ కంటే ప్రేక్షకులని మెప్పించడమే ముఖ్యమని, ఫ్యూచర్ లో ఇలాగే ఎన్నో మంచి పాత్రలు పోషిస్తానంటూ రోహన్ చెప్పిన మాటలు ఇపుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి !

ALSO READ :తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాక చెన్నైకి వెళ్లిపోయా.. బిందు మాధవి షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

కిర్రాక్ సీత నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది..? నిజంగా గ్రేట్ కదా..

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాక చెన్నైకి వెళ్లిపోయా.. బిందు మాధవి షాకింగ్ కామెంట్స్!

రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ

వారణాసి రూ.290 కోట్ల డీల్ నిజమేనా? అసలు విషయం చెప్పేసిన దిల్ రాజు!

బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!

లిటిల్ హార్ట్స్ క్రేజ్ ఏమైంది మౌళి? దొంగ నా కొడుకుకు షాకింగ్ రెస్పాన్స్?

బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!

Big Stories

Advertisement
×