Dil Raju Varanasi: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినిమా బిజినెస్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ సినిమా నైజాం రైట్స్ ఏకంగా రూ.290 కోట్లకు అమ్ముడయ్యాయని సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో జోరుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే . అయితే దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ తనకు ఇప్పటివరకు అలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదని క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి సినిమాల బిజినెస్ లెక్కలు సాధారణ సినిమాల మాదిరిగా ఉండవని, అవి చాలా భిన్నంగా ఉంటాయని తన మనసులోని మాటని బయట పెట్టారు.
గతంలో ‘బాహుబలి 1’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను తాను డిస్ట్రిబ్యూట్ చేశానని, ‘ఆర్ఆర్ఆర్’ డీల్ అయితే నిర్మాత దానయ్యతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఓకే అయిందని గుర్తు చేసుకున్నారు. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం తన పెట్టుబడికి, వచ్చే రాబడికి సరైన లెక్కలు కుదిరితేనే నైజాం ఏరియా హక్కులు తీసుకునే ఆలోచన చేస్తానని చెప్పారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమా ‘రామాయణం’ వసూళ్లపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1000 కోట్ల మార్కును దాటిన ఈ సినిమా, ఫుల్ రన్‌లో రూ.1800 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ చైనా లాంటి దేశాల్లో కూడా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటే ఈ నంబర్ ఇంకా పెరుగుతుందని చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధిస్తుందని తెలిపారు.ఒకప్పుడు వంద కోట్ల పోస్టర్ అంటే పెద్ద వింతగా చూసేవాళ్లమని, ఇప్పుడు అది సేఫ్ నంబర్‌గా మారిందని సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక తన బ్యానర్ నుంచి రాబోయే సినిమాల గురించి చెబుతూ, రవితేజ హీరోగా ‘వీరాది వీరులు’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలై, అదే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. అలాగే 2028 సంక్రాంతి వరకు తమ సంస్థలో మొత్తం తొమ్మిది సినిమాలు లైన్‌లో ఉన్నాయని, ‘దిల్ రాజు డ్రీమ్స్’ బ్యానర్‌పై మరో మూడు సినిమాలు వస్తాయని మూవీస్ పై అప్ డేట్స్ ఇచ్చేశారు.గత ఐదు నెలలుగా థియేటర్లకు ప్రేక్షకులు మళ్లీ బాగా వస్తుండటం మంచి విషయం అని కంటెంట్ బాగుంటే ఓటీటీ కోసం ఎదురుచూడకుండా జనం థియేటర్లకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
బీ, సీ సెంటర్ల థియేటర్లు కూడా హైదరాబాద్ స్థాయిలో అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. ఓటీటీ డీల్స్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలని, చెప్పిన సమయానికి సినిమా ఇవ్వకపోతే ఓటీటీ సంస్థలు అగ్రిమెంట్ రద్దు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.మరో వైపు కొత్త స్టూడియో తో పాటు, ఈ డిసెంబర్‌లో రెండు ఏఐ (AI) ప్రొడక్ట్స్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు దిల్ రాజు.
ALSO READ :బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!