E-Paper
Advertisement

బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!

బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!
Advertisement

Dada Dhamaka:నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఫెస్టివల్ వైబ్ మొదలైపోయింది. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది మరి.

వాస్తవంగా ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి బజ్ ఉందన్న సంగతి తెల్సిందే. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను తాజాగా గ్రాండ్‌గా మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్‌గా ‘దాదా ధమాకా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపారు.

Advertisement

ఇక ఈ పాట మొదలైనప్పటి నుంచే వైబ్స్ మామూలుగా లేవని చెప్పొచ్చు. ఒక పార్టీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో బాలయ్య తనదైన ఎనర్జీతో, స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టారనడంలో సందేహం లేదు. ఇక బాలయ్య పక్కన బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా స్టెప్పులేయడం తో ఈ పాటకు మంచి గ్లామర్ యాడ్ అయిందనే చెప్పాలి.. ముఖ్యంగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, నర్గీస్ డ్యాన్స్ మూమెంట్స్ కలిపి ఈ పాటను ఒక స్పెషల్ అట్రాక్షన్‌.

ఇక ఈ పాటకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలే బాలయ్య సినిమా అంటే తమన్ పూనకాలు తెప్పించే బీట్స్ ఇస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు తమన్ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఏ రేంజ్‌లో రీ సౌండ్ ఇచ్చాయో చెప్పక్కర్లేదు.ఇక ఇప్పుడు ‘దాదా’ కోసం కూడా అదే రేంజ్ మాస్ బీట్స్‌తో అదరగొట్టాడు ఈ నందమూరి తమన్ .

Advertisement

ఈ పాటలో అసలైన సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా..అదే బాలకృష్ణ స్వయంగా ఈ పాటలో తన గొంతుని కూడా కలపడం. సాధారణంగా సినిమాల్లో హీరోలు స్టెప్పులేయడం చూస్తుంటాం కానీ, బాలయ్య ఇలా ఒక పార్టీ సాంగ్‌లో సింగర్ రజనీ శ్రీ పూర్ణిమతో కలిసి కొన్ని లైన్లు పాడటం ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చిందని చెప్పాలి.ఇక రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కూడా చాలా క్యాచీగా, విన్న వెంటనే హమ్ చేసుకునేలా సింపుల్‌గా ఉండటంతో నెట్టింట్లో మరింత దూసుకుపోతుంది.

ఇక డైరెక్టర్ గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో చెప్పక్కర్లేదు.అలాంటి ఈసారి గ్యాంగ్‌స్టర్ కథను ఎంచుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి .ఇక గ్యాంగ్‌స్టర్ లుక్‌లో బాలయ్య బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్లు, పవర్‌ఫుల్ డైలాగులు ఏ రేంజ్‌లో ఉంటాయోనని ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

ALSO READ :కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!

ఈ ఏడాది చివర్లో, అంటే 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘దాదా’ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.ఇక క్రిస్మస్ సీజన్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి బాలయ్య ఎనర్జీ, తమన్ బీట్స్, నర్గీస్ గ్లామర్ కలిసి ఈ పాటను నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లడం ఖాయమని పాటకి వస్తున్న రెస్పాన్స్ ని చూస్తుంటే అర్థం అవుతుంది !

Tags

Related News

కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!

కథ తెలిసినా రామాయణం ఎందుకు బోర్ కొట్టదు? బీవీఎస్ రవి చెప్పిన సింపుల్ సీక్రెట్!

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

Big Stories

Advertisement
×