E-Paper
Advertisement

రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ

రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ
Advertisement

RGV on AI:AI ..AI ..AI ఇపుడు ఎక్కడ చూసినా ఈ పేరే తెగ వినిపిస్తుంది.అది ఇదీ అన్న తేడా లేకుండా సర్వం అందులోనే దొరికేస్తుంది మరి.ఈ క్రమంలోనే ఇపుడు ఈ AI గనుక మరింత దూసుకువస్తే సినిమాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది. ఇంతింత భారీ బడ్జెట్ లు బడ్జెట్ లు పెట్టి సినిమాలు తీయడం అవసరమా అన్న డిబేట్ అప్పుడే ఇండస్ట్రీలో మొదలైపోయింది కూడా.

ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.ముఖ్యంగాఈ AI యుగంలో భారీ బడ్జెట్స్ పెట్టి సినిమాలు తీయడం అవసరమా అన్న విషయాలపై తన అభిప్రాయాలాని ఇలా బయటపెట్టాడు.

Advertisement

నిర్మాతలకు పెద్ద రిస్క్‌

ఒకప్పుడు సినిమాలకి కోట్ల బడ్జెట్ కుమ్మరించడం అంటే నిర్మాతలకు పెద్ద రిస్క్‌లా ఉండేదని, కానీ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఆ ఆలోచననే పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు ఉన్న మార్కెట్ లెక్కలను దాటి భారీగా ఖర్చు పెడితే, ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించవచ్చని బాహుబలి నిరూపించిందని. ఇప్పుడు రాబోతున్న వారణాసి లాంటి విజువల్ వండర్స్ కూడా అదే స్థాయిలో అంచనాలు పెంచుతున్నాయని తెలిపాడు.

Advertisement

అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి భారీ విజువల్స్ క్రియేట్ చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదని కుండ బద్దలు కొట్టేశాడు.ముఖ్యంగా సుమారు 4000వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం లాంటి సినిమాలను, ఫ్యూచర్ లో ఏఐ సాయంతో చాలా తక్కువ ఖర్చుతోనే తీసే రోజులు వస్తాయని ఆయన తేల్చేశారు.

తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన అవుట్‌పుట్

ఇక ఇప్పుడు వస్తున్న ఏఐ టూల్స్ సాయంతో భారీ సెట్లు, అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ను చాలా తక్కువ బడ్జెట్‌లోనే తయారు చేయొచ్చని తనదైన శైలిలో విశ్లేషించారు. గతంలో ఆదిపురుష్ సినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెట్టినా, అందులోని గ్రాఫిక్స్‌పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని,కానీ అదే సినిమాను సరిగ్గా, ఏఐ సాయంతో చేసుంటే తక్కువ ఖర్చుతోనే ఎంతో అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చేదని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ వెటరన్ ఫిలిమ్ మేకర్.

అయితే ఏఐ అనేది కేవలం టూల్ మాత్రమేనని, అది ఒక్కటే మంచి సినిమాను తయారు చేయలేదని దర్శకుడి ఆలోచన, కథ చెప్పే విధానం, అందులోని ఎమోషన్స్ అన్నీ సరిగ్గా కుదిరినప్పుడే ఏ టెక్నాలజీ అయినా పనిచేస్తుందని గుర్తు చేశాడు . ఇక్కడే అసలు చిక్కు ఉందని హెచ్చరించాడు.

స్టార్ ఇమేజ్ లేదా కొత్త కథ మాత్రమే

ఏఐ వల్ల గ్రాఫిక్స్ చేయడం ఈజీ అయిపోతే , ఇప్పటివరకు వాటినే నమ్ముకుని బతుకుతున్న వీఎఫ్ఎక్స్ నిపుణులు, ఆర్ట్ డైరెక్టర్లు, సెట్ డిజైనర్ల వంటి ఎంతోమంది టెక్నీషియన్లకు పని తగ్గిపోయే ప్రమాదం ఉందని , భవిష్యత్తులో స్టార్ హీరోలు, హీరోయిన్ల అవసరం కూడా తగ్గిపోవచ్చని సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చాడు వర్మ.

ఇప్పటివరకు ఒక హీరో ఫేస్ చూసి జనం థియేటర్లకు వచ్చేవారని కానీ ఏఐ వల్ల తక్కువ ఖర్చుతో వేల సంఖ్యలో సినిమాలు పుట్టుకొస్తే, ఆడియన్స్ సంఖ్య మాత్రం అంతే ఉంటుంది కాబట్టి ఏ సినిమాకు సరైన గుర్తింపు రావడం కష్టమవుతుందని అలాంటప్పుడు కేవలం స్టార్ ఇమేజ్ లేదా కొత్త కథ మాత్రమే సినిమాను నిలబెట్టగలవని తనదైన శైలిలో విశ్లేషించారు.

అయితే ఒక్క ఇండస్ట్రీలోనే కాకుండా మనుషులు చేసే చాలా పనులను రాబోయే రోజుల్లో యంత్రాలే చేసేస్తాయని తెలిపారు.కానీ మనిషికి ఉండే ఎమోషన్స్, ఎక్స్పీరియన్స్ ,థాట్ ప్రాసెస్ వంటివి మెషీన్స్ కి ఎప్పటికీ రావని క్లారిటీ ఇచ్చారు.చూడాలి మరి వర్మ అంటున్నట్టుగా ముందు ముందు ఈ AI సినిమా ఇండస్ట్రీని ఎలా కబలిస్తుందో !

ALSO READ :నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

Tags

Related News

వారణాసి రూ.290 కోట్ల డీల్ నిజమేనా? అసలు విషయం చెప్పేసిన దిల్ రాజు!

బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!

లిటిల్ హార్ట్స్ క్రేజ్ ఏమైంది మౌళి? దొంగ నా కొడుకుకు షాకింగ్ రెస్పాన్స్?

బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!

కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!

కథ తెలిసినా రామాయణం ఎందుకు బోర్ కొట్టదు? బీవీఎస్ రవి చెప్పిన సింపుల్ సీక్రెట్!

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

Big Stories

Advertisement
×