Bindu Madhavi:బిందు మాధవి..తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ మదన పల్లి ముద్దుగుమ్మ.’ఆవకాయ బిర్యానీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.ఇక తాజాగా ‘డార్క్ చాక్లెట్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్ బిందు కెరీర్, పెళ్లి, సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి ఇలా గురించి చెప్పుకొచ్చింది.
‘ఆవకాయ బిర్యానీ’లో లక్ష్మి జంద్యాల పాత్రతో మంచి పేరు వచ్చినా, ఆ తర్వాత తనకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదని బిందు వాపోయింది.అయితే తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వడం లేదనే కంప్లైంట్ తనకు లేదని, వచ్చిన పాత్రలు నచ్చకే తాను మళ్లీ చెన్నై వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చింది.
అక్కడ మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ ఇవ్వడం వల్ల తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఒక నటిగా తన టాలెంట్‌కు తగ్గ పాత్రలు రాలేదనే చిన్న అసంతృప్తి ఉన్నా, తాను మంచి నటిననే నమ్మకం తనకు ఎప్పుడూ ఉందని, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని చెప్పుకొచ్చింది.
‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘పిట్టగోడ’, ‘వేపం’ వంటి సినిమాలతో పాటు తమిళంలో చేసిన సెక్స్ వర్కర్ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని, కెరీర్లో అప్ అండ్ డౌన్స్ చాలా కామన్ అని వాటి నుంచే తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపింది.
ఇక సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లపై మాట్లాడుతూ అందులో కనిపించేదంతా నిజం కాదని, కొందరు చేసే కామెంట్లను చూసి అందరూ అలాగే అనుకుంటున్నారని అనుకోవడం తప్పని చెప్పింది. సినిమా బాగోలేకపోతే విమర్శించడంలో తప్పులేదు కానీ, నటీనటుల పర్సనల్ లైఫ్ లని,ఫ్యామిలీ మెంబర్స్ ని లాగడం సరికాదని తన అభిప్రాయాన్ని చెప్పింది.మనం తప్పు చేయనప్పుడు ప్రతి కామెంట్‌కు సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదని, ఒకవేళ నిజంగా తప్పు జరిగితే మాత్రం దాన్ని ఒప్పుకుని క్లారిటీ ఇవ్వాలని కుండబద్దలు కొట్టేసింది.
ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందని, కానీ మంచి వాళ్లు దొరకట్లేదని సరదాగా చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. గతంలో పెళ్లి విషయంలో బయటి ఒత్తిడి ఉండేదని, కానీ ఇప్పుడు తన తల్లిదండ్రులు కూడా మారిపోయారని, తనకు నచ్చినట్టు ఉంటూ సంతోషంగా ఉండాలని అమ్మ నిర్మల ఎంకరేజ్ చేస్తారని వివరించింది.
గతంలో రెండు మూడు సంబంధాలు చూసినా, అలా పెళ్లిచూపుల పద్ధతి తనకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని, అలాగే గతంలో ఒకరితో ప్రేమలో ఉండి బ్రేకప్ కూడా అయ్యిందని అసలు విషయం చెప్పుకొచ్చింది.ఇక తన కొత్త సినిమా ‘డార్క్ చాక్లెట్’ గురించి మాట్లాడుతూ శశాంక్ దర్శకుడిగా మారి చెప్పిన ఈ కథ వినగానే ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకున్నానని, అందుకే వెంటనే ఓకే చేశానని చెప్పింది.
ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన నటుడు పడిపోయాక, మళ్లీ నిలబడటానికి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని వివరించింది.మొత్తంగా స్టార్డమ్ కంటే మంచి పని చేయడమే తనకు ముఖ్యమని, మరో 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలబడగలనంటూ బిందు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం!
ALSO READ :దేవిశ్రీ ప్రసాద్ తో స్టేజ్ షో చేస్తే అవమానాలా? దైవిక్ బయటపెట్టిన షాకింగ్ నిజం!