Kirrak Seetha : సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులారిటీని సంపాదించుకుంటున్నారు అన్న విషయం తెలిసింది. సోషల్ మీడియా ద్వారా తమ క్రేజీని పెంచుకోవడంతో పాటుగా డబ్బులు కూడా సంపాదిస్తూ బిజీగా మారుతున్నారు కొందరు. ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాలు లేదా సీరియల్స్లలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అయితే కొంతమందికి బిగ్ బాస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. మరి కొంతమంది సినిమాలకు హీరోలుగా, హీరోయిన్గా సెలెక్ట్ అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ప్రముఖ యూట్యూబర్ కిర్రాక్ సీత ఒకరు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతుంది. అయితే సీత నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి నెలకు సీత ఎంత సంపాదిస్తుంది అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..
సోషల్ మీడియా ద్వారా తమకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకుంటూ సెలబ్రెటీలు అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.. ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి కూడా వాడుతూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా లక్షల సంపాదిస్తూ వస్తున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు ఆ లిస్టులోకి కిర్రాక్ సీత కూడా చేరింది. ఈమె నెలకు దాదాపు పది నుంచి 15 లక్షలు వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే సీత అంత సంపాదిస్తుందా అన్న అనుమానాలు కూడా కొందరికి వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం కన్నడ బ్యాచ్ తో సందడి గా మారింది. కన్నడ బ్యాచ్ కు పోటీగా యూట్యూబర్ సీత కూడా సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అందరితో పోటీపడి మరి బాగానే ఆటలోనూ మాటలోనూ ఎక్కడ తగ్గకుండా తన సత్తా చాటింది కిర్రాక్ సీత.. అయితే బిగ్ బాస్ లో తను విన్నర్ గా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఊహించని రీతిలో ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.. ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది ఏమి నటించిన బేబీ మూవీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రఫ్ లుక్ లో కనిపించిన సీత సినిమాలతో బాగానే ఆకట్టుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా పలు టీవీ షో లతో కూడా సందడి చేస్తూ వస్తుంది. మరి ఈమె నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తుందో అన్నది చూడాలి..
Also Read :ఏంటి.. ప్రేమకు పెళ్ళైందా..? ఊహించని ట్విస్ట్ మావా..