E-Paper
Advertisement

బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!

బాలయ్య హీరోయిన్ అందాల రచ్చ.. చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Pragya Jaiswal:ప్రగ్యా జైస్వాల్..కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య అఖండ సినిమాతో మరింత పాపులర్ అయిన సంగతి తెల్సిందే.అయితే సినిమాల్లో అప్పటి జోష్ చూపించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వరుస అప్ డేట్స్ తో అభిమానులని అలరిస్తూనే ఉంటుంది.ముఖ్యంగా ఆమె షేర్ చేసే లేటెస్ట్ ఫోటోషూట్లు, ఫ్యాషన్ లుక్స్‌కు నెట్టింట మంచి క్రేజ్ ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఇంస్టాలో షేర్ చేసిన సరికొత్త ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ, తన గ్లామర్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది ఈ అందాల భామ.

Advertisement

ఇక ఈ ఫోటోలకు ‘డ్రిప్పింగ్ ఇన్ గోల్డ్’ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌కు ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. ముఖ్యంగా కారులో కూర్చొని స్టైలిష్‌గా ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అవుట్‌ఫిట్, సింపుల్ మేకప్, ఫ్రీ హెయిర్ స్టైల్‌తో క్లాసీ లుక్ లో అదరగొట్టేసింది ప్రగ్యా.

ఇకపొతే  ప్రగ్యా జైస్వాల్ సినీ కెరీర్ విషయానికి వస్తేటాలీవుడ్‌లో ‘కంచె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో ప్రగ్యా ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ దక్కింది.ముఖ్యంగా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కూడా చేయగలనని మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది ఈ బాంబే బ్యూటీ.

Advertisement

ఇక ఆ తర్వాత ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయక’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది ఈ అమ్మడు. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సినిమా ప్రగ్యా కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

అందులో శరణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది.ఇకఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలోనూ సందడి చేసింది ఈ బ్యూటీ.

అలా తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే, 2024లో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేసిన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో కీ రోల్ పోషించి హిందీ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మళ్లీ బాలకృష్ణతో కలిసి ‘డాకు మహారాజ్’ చిత్రంలో కావేరిగా కనిపించి అలరించిన ప్రగ్యా 2025లో విడుదలైన ‘అఖండ 2: తాండవం’ సినిమాలోనూ ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి నటిస్తున్న ‘సూర్యా: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా 2026 నవంబర్ 20న పలకరించేందుకు రెడీ అయిపొయింది ప్రగ్యా. దీనితో పాటు తెలుగులో ‘టైసన్ నాయుడు’ లోనూ కనిపించబోతుంది

ALSO READ :లిటిల్ హార్ట్స్ క్రేజ్ ఏమైంది మౌళి? దొంగ నా కొడుకుకు షాకింగ్ రెస్పాన్స్?

మొత్తంగా సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటం ప్రగ్యా ప్రత్యేకత అని చెప్పాలి.ఆ క్రమంలోనే తాజాగా వదిలిన ఈ గోల్డెన్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

లిటిల్ హార్ట్స్ క్రేజ్ ఏమైంది మౌళి? దొంగ నా కొడుకుకు షాకింగ్ రెస్పాన్స్?

బాలయ్య మాస్ ధమాకా.. దద్దరిల్లిన దాదా సాంగ్!

కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడి సినిమాలే ఆదుకున్నాయా? బీవీఎస్ రవి ఏమన్నారంటే!

కథ తెలిసినా రామాయణం ఎందుకు బోర్ కొట్టదు? బీవీఎస్ రవి చెప్పిన సింపుల్ సీక్రెట్!

టాక్సిక్ విషయంలో అసలు గేమ్ ఇదే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. దిల్ రాజు స్కెచ్ మామూలుగా లేదుగా!

అందాల డోస్ పెంచేసిన రియా.. పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించేసిందిగా!

Big Stories

Advertisement
×