E-Paper
Advertisement

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో మారిన హీరోయిన్.. సాయి పల్లవి తప్పుకుందా?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో మారిన హీరోయిన్.. సాయి పల్లవి తప్పుకుందా?
Advertisement

M.S.Subbalakshmi: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు అలాగే క్రీడ రంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subbalakshmi) బయోపిక్ సినిమా కూడా ప్రేక్షకులుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Gawtham Tinnanuri) దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్లు సమాచారం.

తప్పుకున్న సాయి పల్లవి..

ఇక ఈ బయోపిక్ సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ బయోపిక్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) ఎంపిక అయ్యారని ఈ సినిమాకు అనుగుణంగా ఆమె సంగీతంలో కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంటున్నట్లు గతంలో వార్తలు బయటకు వచ్చాయి. రెండు రోజులుగా ఈ బయోపిక్ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకున్నారని ఆమె స్థానంలో మరొక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గా రుక్మిణి వసంత్..

Advertisement

రుక్మిణి వసంత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో ఈమె అయితే సరిగ్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించారని అందుకే సాయి పల్లవిని తప్పించి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను ఎంపిక చేశారంటూ వార్తలు వైరల్ గా మారడంతో సాయి పల్లవి అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై చిత్రం బృందం కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమా?

Advertisement

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి కొనసాగుతుందని రుక్మిణి వసంత్ నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలను ఖండించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కారణంగా సాయిపల్లవి డేట్స్ అడ్జస్ట్ గాని నేపథ్యంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో సాయి పల్లవి అయితేనే సరిగ్గా సరిపోతారని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ బయోపిక్ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ షాకింగ్ రెమ్యూనరేషన్…

Related News

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

Big Stories

Advertisement
×