E-Paper
Advertisement

మిర్యాలగూడలో నేర నియంత్రనకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన డీఎస్పీ..!

మిర్యాలగూడలో నేర నియంత్రనకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన డీఎస్పీ..!
Advertisement

DSP Rajasekhar Raju: స్వేచ్ఛ బ్యూరో: ఎన్ని అడ్డంకులు ఒత్తిళ్లు వచ్చిన లా అండ్ ఆర్డర్ ను క్రమ పద్ధతిలో అమలుపరచడం సామాన్యులకు న్యాయం దక్కేల చూడటం, నేర నియంత్రణకు విధులు నిర్వర్తించవచ్చని ఆ అధికారి ట్రేడ్ మార్క్ వేసిండ్రు. ఏ కేసు నమోదు చేసే ఈ రాజకీయ ఒత్తిడి వస్తుందో.. ఎక్కడికి బదిలీ కావాల్సి వస్తుందని భయపడకుండా ప్రజల రక్షణకే విధులు చేపట్టిన పరిస్థితి. ఆయన దృష్టికి వెళ్లిన.. ప్రతి కేసు లోతుగా విచారణ చేపట్టి తెర వెనక సూత్రధారులను పసిగట్టి నేరాలను కట్టడి చేయడమే ఆ దికారికి, బాధ్యత సంతృప్తి. ఎటువంటి అండ, ఆదరణ లేని సామాన్యులు తమకు అన్యాయం జరిగిందని నేరుగా ఫిర్యాదులు చేసిన మొదట బాధితులకు మరోసారి ఈ తరహా మోసాలకు బలి కావద్దని.. కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆ కేసు ఏ స్టేషన్ పరిధిలో కొనసాగుతుందని ప్రాథమిక విచారణ జరిపి.. బాధితులకు న్యాయం జరిగే వరకూ ఆ కేసును ఫాలో చేయటంతో అధికారి విధుల పట్ల ప్రజలకు విశ్వసనీయత పెరిగి పోలీస్ శాఖతోపాటు వ్యక్తిగతంగా ఆ అధికారి పట్ల గౌరవం, కృతజ్ఞత పెరిగింది.

రేషన్ బియ్యం దందా..

గంజాయి, క్రికెట్ బెట్టింగ్, పేకాట, సైబర్ క్రైమ్, అధిక వడ్డీల దందాల నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఏపీ లోని పిడుగురాళ్ల, దాచేపల్లి, కాకినాడ ఇతర ప్రాంతాల కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా కీలక సూత్రధారులు మిర్యాలగూడలో రేషన్ అక్రమ రవాణ చేస్తున్నట్టు గుర్తించి ఏపీకి చెందిన మందపాటి నరసింహారావు తో పాటు ఇతర వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఆ దందాను కట్టడి చేసిండ్రు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులను, వారి మాఫియాను కట్టడి చేయడంలో ఆ అధికారి సక్సెస్ అయ్యారు. అతను ఎవరో కాదు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సీఐడి విభాగానికి బదిలీ కాగా రిలీవింగ్ కి సిద్ధమైన రాజశేఖర్ రాజు.

Advertisement

Also Read: BRS : బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..ఏం చేసినా పోదా?

రేషన్ మాఫియా కట్టడి…!

ఇసుక, రేషన్ సహా గేమింగ్ యాక్ట్ మొత్తం 710 కేసుల నమోదు మిర్యాలగూడ డీఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డివిజన్ పరిధిలోని 14 స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న అక్రమాలు, సూత్రధారులు వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలోని దాచేపల్లి పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన రేషన్ బియ్యం మాఫియా మిర్యాలగూడ ప్రాంతంలోని దళారులతో కలిసి పెద్ద ఎత్తున రేషన్ దందా చేస్తున్నట్లు గుర్తించి వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. 90 శాతానికి పైగా రేషన్ దందాను కట్టడి చేశారు. అక్రమ ఇసుకను కట్టడి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా విధులు నిర్వర్తించారు.

మిర్యాలగూడలో..

Advertisement

అదేవిధంగా గంజాయి మత్తులో యువత తప్పుదోవ పడుతుందని గంజాయి పెడ్లర్లను, ఏపీ, ఒరిస్సా నుంచి జరుగుతున్న గంజాయి రవాణాకు బ్రేక్ వేశారు. జూన్ 11న విధుల్లో చేరిన ఆయన సుమారు తన రెండేళ్ల విధి నిర్వహణలో 503 ఇసుక అక్రమ రవాణ, రేషన్ అక్రమ తరలింపు పై 150 కేసులు, గంజాయి పై 28, గేమింగ్ ఎట్ట కింద 28, మోటర్ వెహికల్ యాక్ట్ కింద 15,590 కేసులు నమోదు అయ్యేల చేశారు. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంతో గుర్తింపు పొందిన మిర్యాలగూడలో అసాంఘిక, అక్రమ దందాలను కట్టడి చేయడంతో పాటు పలు కేసుల విషయంలో సామాన్యులకు భరోసాగా నిలిచి తనదైన ముద్ర వేసిన రాజశేఖర్ రాజు విధానాలను రానున్న అధికారులు కూడా అమలు పరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Also Read: దాతల సహకారంతో.. మానవీయతకు మారుపేరుగా నిలిచిన ఓ వివాహం..!

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×