E-Paper
Advertisement

కళ్లలో నీళ్లు లేకపోతే గుండెల్లో బాధ లేనట్టేనా? ఎస్. జానకి మనవరాలి ఆవేదన!

కళ్లలో నీళ్లు లేకపోతే గుండెల్లో బాధ లేనట్టేనా? ఎస్. జానకి మనవరాలి ఆవేదన!
Advertisement

Apsara Vaidyula: దాదాపు అరవయ్ ఏళ్ల పాటు యాబయ్ వేలకి పైగా పాటలు పాడిన గాన కోకిల జానకి కన్ను మూయడం భారత సినీ పరిశ్రమకి పెద్ద లోటు.ఆమె గతించడంతో తమకున్న అనుభవాలని, అనుభూతులని గుర్తుచేసుకుంటూ జానకిని తలుచుకుంటున్నారు.ఇక ఇప్పటికే సుశీలమ్మ బాధ పడుతూ కొంతమంది తమ మధ్య లేని పోని అబద్దాలని నూరిపోసి తమ మధ్య స్నేహాన్ని దూరం చేశారని, జానకమ్మ మరణంతో ఆ దుర్మార్గుల కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఆవేదనతో ఒక పోస్ట్ ని వదిలింది కూడా.ఇక ఇదే క్రమంలో తాజాగా జానకి అప్సర వైద్యుల సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ కొన్ని ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

అమమ్మ చనిపోయిందన్న బాధ ఏ మాత్రం కనిపించట్లే

Advertisement

విషయంలోకి వెళ్తే.. జానకి మరణించినప్పటికీ అంటే జానకి మనవరాలైన  అప్సర వైద్యుల మొహం లో అమమ్మ చనిపోయిందన్న బాధ ఏ మాత్రం కనిపించట్లేదని, అసలు జానకమ్మ మీద ఏమైనా ప్రేమ ఉందా అంటూ కొంతమంది అప్సర ని ఉద్దేశించి కామెంట్స్ పెట్టడం అప్సర ని తీవ్రంగా బాధించింది.దీంతో జానకమ్మపై తనకు ఎలాంటి ప్రేమ ఉందొ చెబుతూ ఇలా చెప్పుకొచ్చింది.

తన అక్క అయిన వర్ష ఆగస్టు 2023లో చనిపోయిందని, అప్పటి నుండి తమ కుటుంబం ఏంటో బాధలో ఉందని, ఇక వర్షకి, జానకమ్మకి మంచి బాండింగ్ ఉండేదని చెప్పుకొచ్చింది. వర్ష మరణం తనని కుంగదీసినప్పటికీ అమ్మమ్మ బాధ్యతలని తన భుజాన వేసుకొని చూసుకున్నాని ,అలాంటి తనకు అమ్మమ్మ పై ప్రేమ లేకపోవడం ఎంటని మనసులోని బాధని బయటపెట్టింది.

Advertisement

అయితే అందరిలా తాను గుక్కపట్టి ఎదవలేదని , ఆ బాధని అంతా గుండెల్లో దిగమింగుకున్నానని బాధ పడింది. కళ్ళల్లో నీళ్ళు రానంత మాత్రాన ప్రేమలేదని ఎలా తెల్చేస్తారని ,అసలు నాకు మా అమ్మమ్మకి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండేదో మీకు తెలుసా అని వాపోయింది.

ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే!

మాములుగా పబ్లిక్ లైఫ్ లో ఉంటె పుకార్లు, గాసిప్స్ కామన్ అని,కాని ఒకరి పర్సనల్ ఎమోషన్స్ ని ఎలా అనుమానిస్తూ అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.జానకి అమ్మ, సోదరి వర్ష ..ఇద్దరిలోనూ ఒక అమాయకమైన, పసిపిల్లల లాంటి మనస్తత్వం ఉండేదని, ఇపుడు వారిద్దరూ స్వర్గంలో కలిసి ఉంటారన్న ఆలోచన తనకి ఎంతగానో ఓదార్పునిస్తుందని తెలిపింది.

ఇక జానకి విషయానికి వస్తే  వి.రామ్‌ప్రసాద్‌ను పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడింది.వారికి మురళి కృష్ణ అనే ఒక కుమారుడు ఉన్నాడు ఈయన భరతనాట్యంలో మంచి నిష్ణాతుడు.తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు కూడా .ముఖ్యంగా తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేశాయి.ఇక భర్త  వి.రామ్‌ప్రసాద్‌  1990 లలో మరణించగా, కొడుకు మురళీకృష్ణ జనవరి 22, 2026న 65 సంవత్సరాల వయసులో మరణించాడు.ఏది ఏమైనా సిరిమల్లె పువ్వా’ పాట అయినా, “స్వాతిముత్యం” లోని ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య పాట అయినా ఆమె పాడితేనే వాటికి ప్రాణం వస్తుందన్న సంగతి ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే!

Related News

Samantha:సమంత డెలివరీ ఎక్కడో తెలుసా?

జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ

‘రా ఎన్టీఆర్’ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ అఫీషియల్ స్టేట్మెంట్!

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !

మీ ముందే బట్టలు విప్పాలా..? లైవ్‌లోనే ఫొటోగ్రాఫర్‌పై జరీన్ ఖాన్ ఫైర్.. వీడియో వైరల్!

తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

కొత్తింట్లో శృతి హాసన్ గృహప్రవేశం.. ఆ ఇంటి ప్రత్యేకతలు చూస్తే ఔరా అనాల్సిందే..!

Big Stories

Advertisement
×