E-Paper
Advertisement

Samantha:సమంత డెలివరీ ఎక్కడో తెలుసా?

Samantha:సమంత డెలివరీ ఎక్కడో తెలుసా?
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. అటు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న.. ఈ చిన్నది రీఎంట్రీలో కూడా తన స్టామినా నిరూపించింది. ఖుషీ సినిమా తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని.. మా ఇంటి బంగారం సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో హోమ్లీగా కనిపిస్తూనే మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. వన్ ఫిమేల్ షోగా నిలిచింది మా ఇంటి బంగారం . అంతేకాదు ఈ సినిమా నెల తిరగకుండానే రూ.100కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది.

ఈ ఏడాదే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత..

ఇకపోతే పెళ్లి తర్వాత సమంత రెండు శుభవార్తలను అందుకుంది. ఒకటి తాను నటించిన మా ఇంటి బంగారం సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం.. మరొకటి తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న శుభ పరిణామం. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన ఈమె ఇటీవల గర్భవతిని అంటూ చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బేబీ బంప్ తో కనిపించి ఆకట్టుకున్న సమంత.. ప్రస్తుతం మెటర్నటీ లీవ్ లో భాగంగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది డిసెంబర్లో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

బర్త్ టూరిజంపై చర్చ..

Advertisement

ప్రెగ్నెన్సీ దాల్చిన కారణంగా నివాసానికే పరిమితమైంది సమంత. ఈ నేపథ్యంలోనే డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుంది అనే అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈమధ్య కాలంలో ట్రెండింగ్ లోకి వచ్చిన ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. నిజానికి గర్భం దాల్చిన తర్వాత సంపన్నులు, సెలబ్రిటీలు అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాలలో పుట్టిన బిడ్డలకు పౌరసత్వం లభించే అవకాశం ఉండడంతో చాలామంది ఆ దిశగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత తన డెలివరీ కోసం ఏ దేశాన్ని ఎంచుకోబోతోంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

అసలు డెలివరీ ఎక్కడంటే?

Advertisement

ఈ మేరకు తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో బర్త్ టూరిజం పై నెలకొన్న గందరగోళం వీసా సమస్యల కారణంగా సమంత అమెరికా వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. మరొకవైపు కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ ఆమెకు అక్కడికి వెళ్లే ఆలోచన లేదని సమాచారం. ఇక ఈ విషయంపై సమంత టీం కి చెందిన ఒక క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహగానాలను కొట్టి పారేసింది. సమంత ఎక్కడికో వెళ్లి తన బిడ్డకు బర్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. మాతృభూమిలోనే ఆమె తన మొదటి బిడ్డకు ఆహ్వానం పలకబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం సమంత ముంబైలోనే ఉంటున్న నేపథ్యంలో అక్కడే డెలివరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ:‘రా ఎన్టీఆర్’ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ అఫీషియల్ స్టేట్మెంట్!

సమంత మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్..

ఏది ఏమైనా సమంత ఎక్కడ డెలివరీ కి వెళ్లినా.. అక్కడ సుఖప్రసవం కావాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక మరొకవైపు సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా జూలై 17వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Related News

జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ

‘రా ఎన్టీఆర్’ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ అఫీషియల్ స్టేట్మెంట్!

కళ్లలో నీళ్లు లేకపోతే గుండెల్లో బాధ లేనట్టేనా? ఎస్. జానకి మనవరాలి ఆవేదన!

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !

మీ ముందే బట్టలు విప్పాలా..? లైవ్‌లోనే ఫొటోగ్రాఫర్‌పై జరీన్ ఖాన్ ఫైర్.. వీడియో వైరల్!

తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

కొత్తింట్లో శృతి హాసన్ గృహప్రవేశం.. ఆ ఇంటి ప్రత్యేకతలు చూస్తే ఔరా అనాల్సిందే..!

Big Stories

Advertisement
×