E-Paper
Advertisement

తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!
Advertisement

Political Entry:  ఏముహూర్తాన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం'(TVK)అనే పార్టీ పెట్టి రెండేళ్ళల్లోనే సీయం సీటు ఎక్కేసరికి మన స్టార్ హీరోలకి కూడా ఆ సీయం సీటుపై మనసు పడిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.అక్కడ విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే, ఇంకా ఈ ఈవెంట్లలో విజిల్స్,ఆడిటోరియంలో చప్పట్లకే పరిమితం కావాలా.. అన్న ఆలోచనలో పడ్డారా …అందుకే ఇలా పాలిటిక్స్ లోకి దారి తీసేలా ఆర్మీలు , అసోసియేషన్లు, ఫ్యాన్స్ క్లబ్ లు అంటూ హడావిడి చేస్తున్నారా.. అన్న టాక్ వినిపిస్తుంది. ఇపుడు అటు APలో, ఇటు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్న చర్చ ఒక్కటే..తారక్,బన్నీలు ఎవరికి వారు పొలిటికల్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా అని .

18సీట్లకి పరిమితం అయిన మెగాస్టార్ 

నిజానికి రామారావు తర్వాత ఇండస్ట్రీ నుండి రాష్ట్రానికి సీయం అయిన నటుడు లేడు. ఇక నేను సీయం అయితీరతానని పార్టీ పెట్టిన చిరంజీవి ముక్కుతూ మూలుగుతూ 18సీట్లకి పరిమితం అయిన పరిస్థితి.అలా  క్రమక్రమంగా పార్టీని ,కాంగ్రెస్ లో కలిపేసి హమ్మయ్య అని చేతులు దులుపుకున్నాడు.అది తట్టుకోలేక అన్నతో విభేదించిన పవన్ కళ్యాణ్ జనసేన అంటూ 2014లో ఎంట్రీ ఇచ్చి 2024 లో కాని పవర్ ని పట్టుకోలేకపోయాడు. అయితే అదికూడా ,TDPకి సపోర్ట్ చేస్తూ డిప్యూటీ సీయంగా..ఒకరకంగా ఇది అక్కడి కాపు నాయకులకి, యూత్ కి అంతగా జీర్ణం కావట్లేదనే చెప్పాలి.మనం పల్లకిమోయడమేనా, మనమెప్పుడు పల్లకి ఎక్కేది అంటూ అడపాదడప జనసైనికులు అసహనం బయటపెడుతున్నారు కూడా.

తగ్గేదేలే అంటూ సీయం సీటు టార్గెట్ గానే

Advertisement

సరిగ్గా బన్నీఇదే పట్టుకున్నాడు అంటున్నారు పొలిటికల్ పండితులు. ఎందుకంటే పుష్ప సిరీస్ తో నేషనల్ వైడ్ గా సత్తా చాటిన అల్లు అర్జున్ గనుక AP పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే పల్లకీలు మోయడం అనే మాటే ఉండదు . తగ్గేదేలే అంటూ సీయం సీటు టార్గెట్ గానే బరిలోకి దిగుతాడు. అప్పుడు రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్న కాపు తమ్ముల్లంతా బన్నీ వెనక ర్యాలీ అవడం పెద్ద కష్టం కాదు.ఎందుకంటే తమిళనాడు లో అయితే DMK, లేకపోతె ADMK అన్నట్టుగా సాగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ స్థానాలు కొల్లగొట్టి సీయం సీటు ఎక్కాడు విజయ్.

also read :ఎన్టీఆర్ తొలి పారితోషికం వెనుక ఉన్న ఆసక్తికర కథ.. ఈ విషయం చాలా మందికి తెలియదు!

ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని కలుస్తూ పక్కా స్ట్రాటజీ

Advertisement

ఇపుడు ఇక్కడ కూడా అయితే TDP,జనసేన కూటమి. లేకపోతె YSRCP తయారైంది. ప్రజలకి వేరే ఆప్షన్ లేదు, అయితే సైకిల్ తొక్కాలి.లేదంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి. నోరు తెరిచి అరిచే ఆస్కారమే లేదు.అలా కాకుండా ముచ్చటగా మూడో ఆప్షన్ ఉంటె విసుగెత్తిన వాళ్ళందరికీ అదొక మంచి ఫ్లాట్ ఫామ్ కాకుండా ఉంటుందా అన్నది బన్నీ మనసులో ఉన్న మాటని, అందుకే 2034 ఎలక్షన్లె లక్ష్యంగా ఇప్పుడే ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని కలుస్తూ పక్కా స్ట్రాటజీలతో ముందుకు పోతున్నాడన్నది కొందరు విశ్లేషకుల మాట.

సైలెంట్ గా పోలిటికల్ ఎంట్రీకి గేట్లు తెరుస్తున్న తారక్ 

ఇక ఇదే బాటలో తారక్ కూడా నడుస్తున్నాడని, తాత పార్టీలో స్థానం లేకపోవడంతో ఎలాగైనా తనని తాను నిరూపించుకోవాలని, అందుకే ఊరు వాడా అంటూ సైలెంట్ గా పోలిటికల్ ఎంట్రీకి గేట్లు తెరుస్తున్నాడని, అందులో భాగంగానే ఈ నెల 18న ‘ఊరు–వాడ’ అనే కొత్త ప్రోగ్రామ్‌ కి తెరతీశాడన్నది లోలోన వినిపిస్తున్న మాట. ఇప్పటికే బాబు తర్వాత లోకేష్ లైన్లో ఉండటం, మరో వైపు అభిమానులు ఎక్కువగా తారక్ ని సీయం సీటుపై ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆశగా ఎదురుచూడటం, ఇంకో వైపు బాలయ్య ఫ్యామిలీ తారక్, కళ్యాన్ రామ్ లని అంతగా పట్టించుకోవట్లేదని ..ఇలా అన్ని ఆలోచించే తారక్ ఇలా చిన్నగా తన గేమ్ ని మొదలెట్టబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండితులు.అయితే బయటికి ఇది జస్ట్ ఒక సోషల్ సర్వీస్ మాత్రమే అన్న కవరప్ ఇచ్చినా లోలోన అంతకు మించింది ఇంకేదో నడుస్తుంది అన్న వాదన బలంగా వినిపిస్తుంది.

ఎవరి బాటలో ఈ స్టార్ హీరోలు నడుస్తారో !

అయితే పాలిటిక్స్ అంటూ అడ్డంగా పడిపోయిన కమల్ ,చిరు లాంటి వాళ్ళూ ఉన్నారు.ఎదురొడ్డి నిలబడ్డ విజయ్ లాంటి వాళ్ళూ ఉన్నారు.ఇక వస్తామని చెప్పి అబ్బే కష్టం లే అని యూ టర్న్ తీసుకున్న రజినీ లాంటి వాళ్ళూ ఉన్నారు..చూడాలి మరి వీరిలో ఎవరి బాటలో ఈ స్టార్ హీరోలు నడుస్తారో !

Related News

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !

మీ ముందే బట్టలు విప్పాలా..? లైవ్‌లోనే ఫొటోగ్రాఫర్‌పై జరీన్ ఖాన్ ఫైర్.. వీడియో వైరల్!

కొత్తింట్లో శృతి హాసన్ గృహప్రవేశం.. ఆ ఇంటి ప్రత్యేకతలు చూస్తే ఔరా అనాల్సిందే..!

ఎన్టీఆర్ తొలి పారితోషికం వెనుక ఉన్న ఆసక్తికర కథ.. ఈ విషయం చాలా మందికి తెలియదు!

అభిమానులకు షాక్.. ఇండస్ట్రీకి దూరం కానున్న రణ్‌వీర్ సింగ్!

ఇండియన్ సినిమాలకు మరిన్ని ఆస్కార్స్.. అంచనాలు పెంచేసిన రాజమౌళి కొడుకు!

ప్రియుడితో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

Big Stories

Advertisement
×