E-Paper
Advertisement

మీ ముందే బట్టలు విప్పాలా..? లైవ్‌లోనే ఫొటోగ్రాఫర్‌పై జరీన్ ఖాన్ ఫైర్.. వీడియో వైరల్!

మీ ముందే బట్టలు విప్పాలా..? లైవ్‌లోనే ఫొటోగ్రాఫర్‌పై జరీన్ ఖాన్ ఫైర్.. వీడియో వైరల్!
Advertisement

Zareen Khan: లైక్ ,కామెంట్, షేర్, సబ్ స్క్రైబ్..ఇదీ ఇపుడు జనాలు పాటిస్తున్న తారకమంత్రం, పొద్దున్న లేస్తే చాలు, వైరల్ అవడం కోసం పడే తంటాలు ఎన్నో, కాసేపు గనుక ఇంటర్నెట్ ఆగిపోతే అసలు మనం బతికే ఉన్నామా అని గిల్లుకునే పరిస్థితి. ఇక నయా జమానాలో వచ్చే వ్యూస్ కోసం, కొట్టే లైకుల కోసం పాపరాజీలు (ఫొటోగ్రాఫర్లు) చేసే విన్యాసాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.

తారలు కనిపిస్తే చాలు చుట్టుముట్టి కెమెరాలతో ఎటాక్ చేయడం చూస్తూనే ఉంటాం.అయితే కెమెరాలతో అడ్డ దిడ్డంగా ఫోటోలు తీయడమే కాకుండా అప్పడప్పుడు బార్డర్ క్రాస్ చేస్తూ తారల చేతిలో చివాట్లు తింటుంటారు .ఇదిగో అలానే ఒక పాపరాజీ నోటికొచ్చినట్టు మాట్లాడి నటి జరీన్ ఖాన్ కోపానికి బలయిపోయాడు.

Advertisement

also read :తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

ఆ అవుట్‌ఫిట్‌ ని ఇక్కడే వేసుకుని చూపించొచ్చు కదా

విషయంలోకి వెళ్తే ..నటి జరీన్ ఖాన్ ఒక కొత్తగా పెట్టిన బట్టల షాప్ కి ఓపెనింగ్ కి వెళ్లింది. ఇక అక్కడ ఎప్పటిలాగే ఒక స్టైలిష్ జీన్స్ అవుట్‌ఫిట్‌ ని మీడియాకి చూపిస్తూ కెమెరాలకి ఫోజులు ఇచ్చే పనిలో పడింది. అక్కడి వరకు బాగానే ఉంది.కాని నోటి దూల ఆపుకోలేకపోయిన ఒక పాపరాజీ (ఫొటోగ్రాఫర్) ఊరుకోకుండా ఆ అవుట్‌ఫిట్‌ ని ఇక్కడే వేసుకుని చూపించొచ్చు కదా అంటూ ఓ మాట వదిలాడు.

Advertisement

ఇంకేం ఒక్కసారిగా జరీనా ఖాన్ కి చిర్రెత్తుకొచ్చింది.ఏంటి ఇది మీ అందరి ముందు మార్చుకోవాలా , అది కాని పని, నాతో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తె నేను అస్సలు ఊరుకోను అంటూ ఆ పాపరాజీని ఏకి పారేసింది. అలా ఒకసారిగా జరీనా ఖాన్ అగ్గిమీద గుగ్గిలం అవడంతో కాలు కాలిన పిల్లిలా సైలెంట్ అయ్యాడు ఆ పాపరాజీ.ఆ …కెమెరా వెనకాల ఉండి ఒక మాట అనేస్తే చెల్లిపోతుంది అనుకున్నాడేమో కాని జరీఖా ఖాన్ ముందు ఆ పప్పులు అస్సలు ఉడకలేదు. ఇక మరికొందరైతే షవర్ గూర్చి ఏదైనా ప్రమోట్ చేస్తే స్నానం అక్కడే చేయాలా అంటూ ఆ ఫోటోగ్రాఫర్ ని ఎకిపారేస్తున్నారు నెటిజన్లు .

ఈ ట్రెండ్ లో ఏమైనా మార్పు వస్తుందో !

నిజానికి జరీఖా ఒక్కరే కాదు ..గతంలోనూ ఎంతో మంది ఇలా పాపరాజీల పైత్యాన్ని ఫేస్ చేసిన వారే .ఇక రీసెంట్ గా నేహా ధూపియా కూడా వెనక నుండి వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి అంటూ మండిపడటం మనకి తెల్సిందే. ఏది ఏమైనా వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతాం అంటూ రెడీ అయిపోతున్న ఆ సదరు పాపరాజీలకి ఎప్పుడు బుద్ది వస్తుందో అంటూ గడ్డిపెడుతున్నారు బీ టౌన్ భామలు. చూడాలి మరి ముందు ముందు అయినా ఈ ట్రెండ్ లో ఏమైనా మార్పు వస్తుందో !

also read :ప్రేమలో ఫెయిల్ అయ్యారా? అయితే రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’ చూడాల్సిందే..

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×