Bigg Boss 9:బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది.. 9వ సీజన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 5 వారాలు పూర్తి చేసుకోగా 6వ వారం ఏకంగా 6 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చారు. అయితే రమ్య మోక్షకి కూడా ఒక పవర్ ఇచ్చారు. ఆమె ఎలాగో పచ్చళ్ల ద్వారా ఫేమస్ అయ్యింది కాబట్టి బహుశా అలా ఆలోచించి నచ్చిన ఫుడ్ కోరుకునే పవర్ రమ్య మోక్షకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఒక పార్ట్నర్ ని ఎంచుకోవాలి అని.. ఆ పార్ట్నర్ తో కలిపి తనకు నచ్చిన ఫుడ్ ను బిగ్ బాస్ ను కోరే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ రమ్య మోక్షతో తెలిపారు.. అయితే ఆమె తన పార్టనర్ గా సుమన్ శెట్టి (Suman Shetty) ని ఎంచుకుంది. ఇక ఆయనతో కలిసి తనకు ఏమేం కావాలో ఒక పెద్ద లిస్టు ని బిగ్ బాస్ ముందు ఉంచింది రమ్య మోక్ష.
మరి రమ్య మోక్ష కోరిన ఆ ఫుడ్ లిస్ట్ ఏంటి? అనే విషయానికి వస్తే.. రమ్య మోక్ష పార్ట్నర్ సుమన్ శెట్టితో కలిసి బిగ్ బాస్ ను ఒక రోజుకు అడిగిన ఫుడ్ లిస్ట్ విషయానికి వస్తే..
బ్రేక్ ఫాస్ట్ కి.. ఉప్మా పెసరట్టు, పూరీ , మైసూర్ బజ్జి, కాఫీ కోరింది.
స్నాక్స్ కి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ లు మూడు అడిగిన ఈమె.. వెజ్ టిక్కా పిజ్జా, మిక్సర్ ప్యాకెట్, బనానా చిప్స్ కోరింది. అలాగే ఫోర్ ఎగ్ ట్రేస్, 2 కేజీ మోతీచూర్ లడ్డూలు, జాంగ్రీ , నెయ్యితో పాటు వెజ్ , నాన్ వెజ్ పికెల్స్, చాక్లెట్, ఒక సీతాఫలము, 5 కేజీల చికెన్, పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పు కారంతో కలిపి ఇవ్వాలి అని అలాగే గోల్డెన్ క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రాన్స్ కావాలి అని కోరింది. ఇవన్నీ రమ్య మోక్ష కెమెరా ముందు అడుగుతున్నప్పుడు సంజన (Sanjana ), రీతూ చౌదరి (Rithu Chowdhary) దగ్గరుండి మరీ విన్నారు. అయితే ఈ లిస్టు చూసి రీతు చౌదరి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇది చూసిన బిగ్ బాస్ లవర్స్ కూడా ఒక్క రోజుకే ఇన్ని ఐటమ్స్.. అసలు తిండిపోతులా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9 Srija : శ్రీజ నోటి దూల… ఆ వీడియో వల్లే బిగ్ బాస్ నుంచి అవుట్ ?
ఇకపోతే ఇక్కడ సుమన్ శెట్టిని ఎందుకు ఎంచుకుంది అనే అనుమానం అందరిలో ఎదురవ్వగా.. ఈమె ఇచ్చిన లిస్ట్ చూసిన తర్వాత అందరూ ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే బిగ్ బాస్.. తాను ఎంచుకున్న ఫుడ్ ను ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చని చెప్పారు. అప్పుడు ఆమె షేరింగ్ పార్టనర్ గా సుమన్ ని ఎంచుకుంది. ఆయన ఎందుకు అంటే సుమన్ కేవలం వెజ్ మాత్రమే తింటారు. అందుకే ఈయనను పార్ట్నర్ గా ఎంచుకుంది. ఇది చూసి పచ్చళ్ళ పాపకు తెలివి మామూలుగా లేదుగా అంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.