Supreme Court: దీపావళి పండుగకు ముందు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఇచ్చేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రజలు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది.
సాధారణంగా దీపావళి పండుగ సందర్భంగా భారీగా కాలుష్యం వ్యాప్తి చెందుతుందని, ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో వాయు నాణ్యత తీవ్రంగా పడిపోతుందని.. పర్యావరణ సంస్థలు పలు సార్లు హెచ్చరించాయి. ఈ క్రమంలో సాధారణ పటాసులు నిషేధించి, తక్కువ కాలుష్యాన్ని కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశారు జారీచేసింది.
గ్రీన్ క్రాకర్స్ అనేవి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , అలాగే నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) రూపొందించిన ప్రత్యేక టపాసులు. వీటిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి హానికర రసాయనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి 30-40 శాతం వరకు తక్కువ పొగ, శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయి.
సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఇవే..
అక్టోబర్ 18 నుండి 21 వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి అనుమతి ఇచ్చారు.
రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవలని సూచించింది.
క్రాకర్స్ విక్రయం లైసెన్స్ కలిగిన షాపుల్లో మాత్రమే జరగాలి.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులు మాత్రమే.. గ్రీన్ క్రాకర్స్ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఆన్‌లైన్ విక్రయాలు పూర్తిగా నిషేధించబడ్డాయి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!
గ్రీన్ క్రాకర్స్ వాడకంతో కాలుష్యం స్థాయిలు తగ్గి, నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.