Bigg Boss Tamil 9: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ డూపర్ హిట్. ఎన్ని సీజన్లైనా.. ఎప్పటికప్పుడ కొత్త వినోదం అందిస్తూ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదట హాలీవుడ్లో ప్రారంభమైన మెల్లిమెల్లిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసారంకు వచ్చింది. ఇటీవల ఇండియాకు వచ్చిన ఈ షో అన్ని భాషల్లోనూ మంచి ప్రేక్షకాదరణ పొందింది. భారత్లో మొదట హిందీలో ఈ షో మొదలైంది. అక్కడ సీజన్ సీజన్‌కు ఆదరణ పొందుతూ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం హిందీలో 19వ సీజన్ని జరుపుకుంటుంది. కన్నడలో 12 సీజన్ జరుపుకుంటున్న ఈ షో తెలుగులో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కొనసాగుతుంది. మరోవైపు తమిళంలోనూ బిగ్ బాస్ షో 9వ సీజన్ని జరుపుకుంటుంది. ఈ షోని తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమిళ్ బాగ్ బాస్ షోను ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసి ఆడియన్స్ అంతా ఛీ ఛీ అంటూ బిగ్బాస్ షోపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ భాషలో అయినా బిగ్ బాస్ షోపై ఎన్నో విమర్శలు వస్తుంటాయి. ఎంతోమంది బిగ్బాస్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక కార్యకర్తల నుంచి ఈ షోపై విమర్శలు వెల్లువెత్తుంటాయి. దీనికి కారణం కొంతమంది కంటెస్టెంట్స్ తీరు. బిగ్ బాస్ షో కాన్సెప్ట్ కరెక్ట్ కానీ, కంటెస్టెంట్స్ తీరే ఆడియన్స్, నెటిజన్స్కి ఆగ్రహం తెప్పిస్తుంది. ఇందులో గొడవలు, ఆటలు వరకు ఒకే. ఆ తర్వాత లవ్ ట్రాక్స్ వరకు కూడా ఒకే. మగ, ఆడ కంటెస్టెంట్స్ మధ్య బాండింగ్ కుదిరితో లవ్ ట్రాక్ మొదలవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి మితిమీరిపోతున్నాయి.
Also Read: Bollywood Movies : హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం
ఇదోక నేషనల్ ప్లాట్‌ఫాం అనే విషయాన్ని కూడా కంటెస్టెంట్స్ మర్చిపోతున్నారు. కొందరు లవ్ట్రాక్ దాటి రొమాంటిక్ ట్రాక్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సన్నివేశాలను హిందీ బిగ్బాస్లో చూశాం. నార్త్లో ఇదంత సాధారణమే అంటారు. కానీ, తాజాగా తమిళ బిగ్బాస్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి కంటెస్టెంట్స్ వాష్‌రూంలో దూరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుత తమిళంలో జరుగుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన తుషార్, ఆరోరా సింక్లైర్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. హౌజ్లో వీరద్దరు మంచి స్నేహితులుగా మెదులుతున్నారు. ఆరోరా డల్ అయిన ప్రతిసారి తుషార్ ఆమెకు ధైర్యం చెబుతూ బూస్ట్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య హగ్గులు ఎక్కువై పోతున్నాయి.
#AuroraSinclair asking #Tushaar come inside the washroom for the conversation 😏😏😏
Ellam oru mudivoda thaan BB vanthrupanga polayae! #BiggBossTamil9 #BiggBoss9Tamil
pic.twitter.com/GSxo8Y8Hns— BB Mama (@SriniMama1) October 15, 2025
అయితే నిన్న రాత్రి ఆరోరా, తుషార్తో మాట్లాడాలంటూ వాష్రూంకి పిలిచింది. అంతేకాదు మైక్ కూడా తీసేసి అతడితో ఏదో సీక్రెట్గా మాట్లాడానికి ప్రయత్నించింది. కానీ, తుషార్ మాత్రం ఆమెతో డిస్టెన్స్ మెయింటెన్ చేశాడు. ఇది కరెక్ట్ కాదంటూ బయటకు వెళుతుంటే.. లేదు రా నీతో మాట్లాడాంటూ సైగలు చేసింది. చివరకు బిగ్ బాస్ వార్న్ చేయడంతో ఆమె మైక్ ధరించింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ఇది బిగ్బాస్ హౌజా, ఓయె రూమా అంటూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్స్ తీరుపై అసహనం చూపిస్తున్నారు. అసలైన ఆట తప్ప అన్ని చేస్తున్నారంటూ కంటెస్టెంట్స్ విమర్శిస్తున్నారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ అనేది ఓ బ్రోతల్ హౌజ్ అంటూ నెటిజన్స్ నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.