Bigg Boss 9 : బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో అందరూ అలవాటైపోయారు అనుకునే టైంలో ఎవరూ ఊహించిన విధంగా ఫైర్ స్ట్రోమ్ వచ్చింది. ఏకంగా మొత్తం ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. హౌస్ లోకి ఎంట్రీ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా మారాయి అనడంలో తప్పులేదు. ఎందుకంటే ముఖ్యంగా దువ్వాడ మాధురి, రమ్య మోక్ష స్పెషల్ అట్రాక్షన్ గా మారుతున్నారు. లేనిపోని దానికి గొడవలు పడే ఉద్దేశంతో ఉన్నారు అని చూస్తుంటే ఈజీగా అర్థమయిపోతుంది.
ఈ షో కి చాలామంది వీక్షకులు ఎంత అలవాటు పడిపోయారంటే ఆరోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ మాత్రమే కాకుండా 24 గంటలు కనిపించే ఫుటేజ్ ను చూడడానికి ఇష్టపడుతున్నారు. 24 గంటల ఫుటేజ్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అసలైన రంగులు 24 గంటలు జరిగే లైవ్ చూస్తుంటేనే బయటపడుతుంది.
అయితే బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా చూస్తున్న తరుణంలో లైవ్ స్ట్రీమింగ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. కొంతసేపు పాటు లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు ఎక్కడ కనిపించలేదు. కేవలం లైవ్ స్ట్రీమింగ్ మాత్రమే కాకుండా అసలు రియాలిటీ షోస్ కు సంబంధించిన వీడియోలు ఏవి కూడా కొద్దిసేపు జియో హాట్స్టార్ లో కనిపించలేదు. దీనివలన బిగ్బాస్ కి కూడా అంతరాయం జరిగింది.
బిగ్ బాస్ కాసేపు కనిపించకపోయేసరికి చాలామంది వీక్షకులు ఆందోళన పడిపోయారు. బిగ్ బాస్ యాజమాన్యం కు ఏమైందో అని కాదు కొద్దిసేపటి పాటు ఖంగారు పడిపోయారు. నిజమైన మళ్లీ కొంతసేపటి తర్వాత అన్ని కనిపించడం మొదలయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ 24 గంటల స్ట్రీమింగ్ కూడా హాట్స్టార్ లో కనిపిస్తుంది.
ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ చాలా ప్రాముఖ్యం అయిపోయింది. చాలామంది జీవితాల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఉపసమనంగా మారింది. అటువంటి తరుణంలో బిగ్ బాస్ వచ్చి చాలామంది ఆ షో కు అడిక్ట్ అయ్యేలా చేసింది. మొత్తానికి ఈ కంప్లీట్ స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తుంటే అందరూ ఒక్కొక్కరుగా ఓపెన్ అవుతున్నారు అని అర్థమవుతుంది.
అయితే ప్రస్తుతానికి బిగ్ బాస్ టైటిల్ ఎవరు అందుకుంటారు అనే క్లారిటీ ఇప్పటికీ రాకపోవడం ఆశ్చర్యం.ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ లోనూ కూడా ఇప్పటికీ కొన్ని లూప్ హోల్స్కనిపిస్తున్నాయి.
Also Read: Duvvada Madhuri : మాధురి ఇది మీ ఇల్లు కాదు, రెచ్చిపోయిన దువ్వాడ మాధురి