వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమాసేన్ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడ్డారు. నన్ను అరె అన్నయ్య అంటావా అని భూమాసేన్ శ్రీనివాస్ ని తిట్టారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. గుడ్డలు ఊడతీసి కొడతా అన్నారు శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఇదే కాదు ఇలాంటి ఘటనలు బీజేపీలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.
Also Read: దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు కోరుతూ.. బీసీ సంఘాల నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఎంపీ R.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే గొడవ పడ్డారు. ఈ తోపులటాలతో గందరగోళం నెలకొంది.