Bigg Boss 9 Floara: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు 9వ సీజన్ కూడా మొదలైంది. అందులో భాగంగానే ఐదు వారాలు పూర్తి చేసుకుంది ఈ షో. ఇదిలా ఉండగా తొమ్మిది మంది సెలబ్రిటీలు 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో సెలబ్రిటీలు ఇద్దరు, కామనర్స్ నలుగురు ఐదు వారాలకు గానూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అలా ఐదవ వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది ప్రముఖ సెలబ్రిటీ ఫ్లోరా షైనీ (Floara saini)అలియాస్ ఆశా షైనీ.
హౌస్ లో ఉన్న వారితో పెద్దగా కలవదు.. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. హౌస్ లో ఉండాలన్న ఆసక్తి తనలో పెద్దగా కనిపించలేదు. ప్రతివారం ఎలిమినేషన్ కు రెడీగా ఉంటుంది. ఒకానొక సమయంలో తాను సేవ్ అయినట్లు నాగార్జున చెప్పగానే.. నిజమా? నేను సేవ్ అయ్యానా? అని కూడా నోరెళ్ళబెట్టింది. అనుకున్నట్లుగానే ఐదవ వారం హౌస్ నుండి బయటకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న ఫ్లోరా తన వ్యక్తిగత జీవితంపై ఊహించని కామెంట్లను చేసింది.
అందులో భాగంగానే తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. “నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ అతడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న రెండు మూడు సంవత్సరాలకు విడాకులు అవుతున్నాయి. ఇప్పటికే నా ఫ్రెండ్స్ ను ఎంతో మందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. రిలేషన్ షిప్ లోనే నేను సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది ఫ్లోరా షైనీ. మొత్తానికైతే ప్రియుడు ముద్దు.. పెళ్లి వద్దు అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఫ్లోరా షైనీ కెరియర్ విషయానికి వస్తే మయూరి అనే ఆన్ స్క్రీన్ పేరుతో కూడా ఈమె పాపులారిటీ సొంతం చేసుకుంది. మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో నటించింది. అంతేకాదు కన్నడ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1999లో తెలుగు చిత్రం ప్రేమకోసం అనే సినిమా ద్వారా నటన రంగ ప్రవేశం చేసిన ఈమెకు.. ఈ చిత్ర నిర్మాత ఆశా షైనీ అంటూ పేరు మార్చారు. ఇక ఒక జ్యోతిష్కుడు సలహా మేరకు మయూరి అనే కొత్త స్క్రీన్ పేరును కూడా ఈమె స్వీకరించింది. చివరికి ఈమె అసలు పేరు ఫ్లోరా షైనీగా మార్చుకుంది. నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అనూహ్యంగా బయటకొచ్చింది.
ఇదిలా ఉండగా..2008లో నకిలీ వీసా పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో చెన్నైలో అరెస్టు అయిన ఈమె.. ఆ తర్వాత నిర్దోషి అని పేర్కొన్నారు. అయితే ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అప్పట్లో నిషేధించిన విషయం తెలిసిందే.
also read: Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ సింగర్ బాల సరస్వతి కన్నుమూత!