EK DIN Trailer: ఇప్పటి వరకు సౌత్ సినీ ఇండస్ట్రీకే పరిచయమైన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi).. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె నేచర్‌ని బట్టి.. సాయి పల్లవి బాలీవుడ్ వెళ్లడం కష్టమే అనుకున్నారంతా. కానీ, మంచి పాత్ర అయితే ఏ వుడ్‌లో చేయడానికైనా సిద్ధమే.. అనే హింట్ ఇస్తూ.. ఇప్పుడామె బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘రామాయణ’ కాగా, రెండవది బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Ek Din Official Trailer)ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- OTT Movies: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సినిమాల స్ట్రీమింగ్ పై కఠిన నిబంధనలు..!
థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ ఆధారంగా ‘ఏక్ దిన్’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రోహన్, మీరా అనే ఇద్దరు సహోద్యోగుల కథను ఇందులో చూపించారు. జపాన్‌లోని మంచు కొండల నేపథ్యంలో సాగే ఇంటర్నేషనల్ టూర్ సమయంలో.. వీరిద్దరి మధ్య ఏర్పడిన ‘ఒక్క రోజు’ (ఏక్ దిన్) పరిచయం వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమైందనేదే ఈ చిత్ర కథాంశం అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. సినిమా చాలా క్లాసిక్‌గా, ఫీల్ గుడ్ వైబ్స్‌తో ఉండబోతుందని ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. ముఖ్యంగా సాయి పల్లవి తన సహజ సిద్ధమైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా కట్టిపడేయడం ఖాయమనిపిస్తోంది. ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం కళ్లతోనే హావభావాలను పండించే ఆమె శైలి హిందీ వెర్షన్‌లోనూ కొనసాగడం విశేషం. జునైద్ ఖాన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, ప్రయాణం, వారిద్దరి మధ్య సాగే సంభాషణలు ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘గోట్’కు లైన్ క్లియర్.. వివాదాలన్నీ ముగిసినట్టేనా?
వాస్తవానికి ఈ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. కానీ, మేకర్స్ ఈ ట్రైలర్‌లో ఓన్లీ థియేటర్స్‌లోనే అని చెప్తూ, మే 1న విడుదల అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది మాత్రం సాయి పల్లవి గురించే. సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వెళ్లిన భామలందరూ గ్లామర్ పాత్రల్లో నటించేందుకే ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సౌత్‌లో పద్దతిగా కనిపించిన వారు కూడా బాలీవుడ్‌లో గ్లామర్ ప్రదర్శనకు దిగుతున్నారు. అలాంటిది సాయి పల్లవి మాత్రం కంటెంట్ ఉన్న కథకే ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి ఈ సినిమాతో నిరూపించారు. ఈ సినిమా తర్వాత ఆమె చేస్తున్న ‘రామయణ’లో సీత పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
Also Read- Monalisa Bhosle: ప్రియుడుతో పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.. ఏం జరిగిందంటే?