 
					Telangana Politics: తెలంగాణలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. రేవంత్ మంత్రివర్గంలో తమకు ఛాన్స్ వస్తుందని చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. ఆలస్యం కావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఓ వైపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు నేతలకు కీలక పదవులను అప్పగించింది.
సీనియర్లకు రేవంత్ సర్కార్ పెద్ద పీఠ
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు, మరొకరు బోధన్ ఎమ్మెల్యే సుధర్షన్ రెడ్డి. వీరిద్దరి కీలక బాధ్యతలను అప్పగించి రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు. ఉమ్మడి ఏపీలో ఆయన ఎమ్మెల్సీగా పని చేశారు.
ఒకసారి పీసీసీ సభ్యుడిగా, మరోసారి పీసీసీ కార్యదర్శిగా పని చేశారు. అంతేకాదు వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 నుంచి ప్రేమసాగర్ రావు ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రేమసాగర్ రావు, సుదర్శన్‌రెడ్డిలకు కీలక పదవులు
ఫ్లాగ్ షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలకు ప్రభుత్వ సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని నియమించింది. ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా లభించనుంది. కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వ్యక్తుల్లో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మరొకరు. 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ మంత్రి వర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు.
ALSO READ: టీడీపీ ఎమ్మెల్యే రాజు భగవద్గీత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 19 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయయారు. ఆ తర్వాత నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. 2023 ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించారు. రేవంత్ కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కుతుందని భావించారు. కాకపోతే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో డిలే అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని నియమించిన ప్రభుత్వం pic.twitter.com/ISPCL6aHrs
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025
బోధన్ ఎమ్మెల్యే సుధర్షన్ రెడ్డికి కీలక బాధ్యతలు
ఫ్లాగ్షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా సుధర్షన్ రెడ్డి నియామకం
కేబినెట్ మంత్రి హోదాతో నియామకం
ఫ్లాగ్షిప్ పథకాల అమలును సమీక్షించనున్న సుధర్షన్ రెడ్డి
జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులతో సమన్వయం… pic.twitter.com/Qz0oIgRpGz
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025