E-Paper
Advertisement

ఒక్క ఓటీటీలోనే ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్… ఒక్కోటి ఒక్కో భాషలో

ఒక్క ఓటీటీలోనే ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్… ఒక్కోటి ఒక్కో భాషలో
Advertisement

New Series OTT : తాజాగా ఓటీటీలోకి ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్ అడుగు పెట్టాయి. అవి కూడా తెలుగులో అందుబాటులో ఉండడం అన్నది మరో గుడ్ న్యూస్. మరి తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఆ 3 సిరీస్ లు ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

1. Satrangi : Badle Ka Khel – ZEE5

హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘సత్రంగి బద్లే కా ఖేల్’. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో ఉత్తరప్రదేశ్, బిహార్ గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. అక్కడ శతాబ్దాలుగా మగవారు ఆడవారి వేషం వేసి డ్యాన్స్ చేసే సాంప్రదాయక కళ ‘లౌండా నాచ్’ ఇందులో కీలకంగా ఉంటుంది. బబ్లూ మహ అనే యువకుడి తండ్రి ఈ డ్యాన్స్ చేస్తాడు. ఆ ఊరిలోని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు బబ్లూ తండ్రిని దారుణంగా చంపేస్తారు. దీంతో బాగా చదివి గొప్ప పొజిషన్ లో ఉండాలని కోరుకున్న బబ్లూ ఈ ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలని తీసుకున్న నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుంది అన్నది కథ.

2. Warrant: From the World of Vilangu

Advertisement

తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ విలంగు. 2022లో వచ్చిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘విలంగు’ (Vilangu) సిరీస్ కు సీక్వెల్ గా రూపొందిన ఈ సిరీస్ కోట్టై కరుప్పుసామి (ప్రశాంత్ పాండియరాజ్) అనే అమాయకపు కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. తోటి పోలీసులతో పాటు, పై అధికారులు అతన్ని ప్రతిరోజూ కనీస గౌరవం లేకుండా అవమానిస్తారు, హింసిస్తారు. దీంతో ఓపిక నశించిన హీరో క్రూరంగా మారతాడు. పెండింగ్‌లో ఉన్న పాత వారెంట్ కేసులను విచారిస్తూ అతనిలోని క్రూరత్వాన్ని బయట పెడతాడు. అతని ధోరణి పోలీస్ స్టేషన్‌లో ఒక లాకప్ డెత్ కు దారితీస్తుంది. విఘ్నేష్ నటరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా 8 ఎపిసోడ్లు ఉంటుంది.

Also Read : యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు

3. Shesha 2016

Advertisement

కన్నడ మలయాళ బైలింగువల్ సినిమా ‘శేష’. 2016లో వచ్చిన ఈ మూవీ తాజాగా Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ప్రదీప్ అరసికెరె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకే రాత్రిలో జరిగే ఉత్కంఠభరితమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. 2016లో కర్ణాటక-కేరళ సరిహద్దు ప్రాంతంలో కథ సాగుతుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ (దేవరాజ్), ఏఎస్ఐ ఆంథోనీ (ప్రమోద్ శెట్టి), ఎస్ఐ దాస్ (జాన్ కైప్పల్లిల్)ల మధ్య జరిగే గొడవలతో ఒక రాత్రి మొత్తం నరకంలా మారుతుంది. ఒకరి నుంచి ఒకరు ప్రాణాలు కాపాడుకుని బయట పడడానికి చేసే ప్రయత్నాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×