BigTV English

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

Gautam Gambhir: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు గౌతమ్ గంభీర్ గురించే ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. గౌతమ్ గంభీర్ ను క్రికెట్ అభిమానులు దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అతని నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. అతని వల్ల టీమిండియా సర్వనాశనం అవుతోందని దారుణమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. RIP గౌతమ్ గంభీర్ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. దీని అంతటికి కారణం రోహిత్ శర్మాను కెప్టెన్సీ నుంచి తప్పించడమే. అయితే ఈ ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు తాజాగా గౌతమ్ గంభీర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. టీమిండియా ప్లేయర్లకు మంచి డిన్నర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read: Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

టీమిండియా ప్లేయర్లకు చుక్క, ముక్కా .. గంభీర్ అదిరిపోయే స్కెచ్

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. జట్టు కొన్ని ట్రోఫీలను గెలుచుకున్నప్పటికీ అతను తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో టీమిండియా ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా ఉన్నారు. హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లను జట్టులోకి తరచూ తీసుకోవడం పై కూడా టీమిండియా ప్లేయర్లు పరోక్షంగా ఫైర్ అవుతున్నారట. ఇటు రోహిత్ శర్మ కెప్టెన్సీని తొలగించడం పట్ల అతని అభిమానులు మండిపడుతున్నారు. అప్పట్లో కోహ్లీని తొక్కేశాడని అతని ఫ్యాన్స్ కూడా గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ ను సెలెక్ట్ చేయకపోవడంపై కూడా అతని ఫాన్స్ రెచ్చిపోయారు. ఇలా ప్రతి విషయంలో కూడా గౌతమ్ గంభీర్ విలన్ గా మారుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.


మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలిచిన టీమిండియా ప్లేయర్లంద‌రినీ డిన్నర్ కు పిలవాలని నిర్ణయం తీసుకున్నారట గౌతమ్ గంభీర్. టీమిండియా ప్లేయర్లతోపాటు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన టీమిండియా ప్లేయర్లను కూడా ఆహ్వానించేందుకు గౌతమ్ గంభీర్ ముందుకు అడుగు వేశారట. బుధవారం రోజున అంటే, అక్టోబర్ 8వ‌ తేదీన టీమిండియా ప్లేయర్లంద‌రికీ ఢిల్లీలో పార్టీ ఇవ్వనున్నారట గౌతమ్ గంభీర్. తన ఇంటికి పిలిపించుకొని ఢిల్లీ వంటకాలు టీమిండియా ప్లేయర్లకు తినిపించనున్నారు అంట గౌతమ్ గంభీర్. ఈ పార్టీలో సుక్క ముక్కా అన్ని ఉంటాయని సమాచారం. ఇలా అందరిని దావత్ కు పిలిచి, కాస్తయినా ట్రోలింగ్ తగ్గించుకోవచ్చని గౌతమ్ గంభీర్ భావిస్తున్నారట. మరి ఈవెంట్ కు ఎంతమంది వస్తారో చూడాలి.

ఢిల్లీలోనే రెండో టెస్టు

ఈ నెల 10వ తేదీ నుంచే టీమిండియా వ‌ర్సెస్ విండీస్ మ‌ధ్య రెండో టెస్టు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం టీమిండియా ఢిల్లీకి వ‌చ్చి ప్రాక్టీస్ కూడా చేస్తోంది. అందుకే డిన్న‌ర్ పార్టీ ఢిల్లీలో ప్లాన్ చేశారు గంభీర్‌.

Also Read:  India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

 

Related News

Manoj Tiwary: కోహ్లీ, రోహిత్ ఉంటే ప్ర‌శ్నిస్తారు..అందుకే వాళ్ల గొంతు గంభీర్ నొక్కేశాడు

AB de Villiers: కోహ్లీ, రోహిత్‌పై గ్యారెంటీ లేదు..ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెట‌ర్ !

Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

Womens World Cup 2025: నేడు ఇంగ్లాండ్ తో బంగ్లా ఫైట్‌..పాయింట్ల ప‌ట్టిక ఇదే, చిట్ట‌చివ‌ర‌న పాకిస్థాన్‌

IND VS AUS: టీమిండియాతో సిరీస్.. కమిన్స్ లేకుండా ఆసీస్‌..జ‌ట్ల వివ‌రాలు ఇవే

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

World Cup 2027: రోహిత్, కోహ్లీ ప్రపంచ కప్ 2027 ఆడాలంటే..ఈ రూల్స్ పాటించాల్సిందే !

Big Stories

×