Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీలు బైపోల్ను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారంలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తోంది. బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ముగ్గురు మంత్రులకు జూబ్లీ హిల్స్ గెలుపు బాధ్యతలను అప్పగించింది.
అటు ప్రభుత్వ వ్యతిరేకత సానుభూతిని అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. ఉప ఎన్నిక గెలుపుతో హైదరాబాద్‌లో సత్తా చాటాలని కమలం పార్టీ చూస్తుంది. ఈ క్రమంలోనే నియోజక వర్గంలో మైనారిటీ ఓటర్లు కీలకంగా మారారు. మైనారిటీ ఓట్లను రాబట్టుకొనేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి.
జూబిలీ హిల్స్ ఉపఎన్నికకి నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అన్ని పార్టీలలో కూడా హడావిడి మొదలైంది. ఇప్పటికే ఒకింత ముందంజలో ప్రచారంలో ముందంజలో బీఆర్ఎస్ ఉంది.. ఎందుకంటే అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్.. దివంగత శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి ఇటు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరా చేసుకొని సానుభూతిని రెండింటిని తమకు అనుకూలంగా కలిసి వస్తాయి అన్న భావంతో ప్రచారంలో ప్రచారం చేసుకుంటూ పోతుంది.
కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కొన్ని హామీలను నెరవేర్చలేక పోయిందంటూ దానికి సంబంధించి బకాయి కార్డులు విడుదల చేస్తూ దానిపైన ప్రచారం చేసుకుంటూ పోతుంది. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ఇక్కడ బాధ్యతలు అప్ప చెప్పింది.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్తో పాటు వివేక్ వెంకట్ స్వామి ఈ ముగ్గురికి కూడా నియోజక వర్గంలో గెలుపు బాధ్యతలను అప్ప చెప్పారు. ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు..
కచ్చితంగా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఏ రకంగానైతే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారో అదే ఇక్కడ కూడా రిపీట్ చేయాలంటూ దిశా నిర్దేశం చేశారు. ఈ గెలుపు అనివార్యం కావాల్సి ఉందంటున్నారు. ఎందుకంటే 2026 ఫిబ్రవరి 10 తో జిహెచ్ఎంసి ఆ కౌన్సిల్ గడువు కూడా ముగుస్తుంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అభ్యర్థులే ఇక్కడ గెలిచే పార్టీనే కచ్చితంగా విజయడంక మోగిస్తుంది.. అది కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.. కాబట్టి కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అంటూ దిశా నిర్దేశం చేశారు. ఇంకా బీజేపీ కూడా తను ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది.
అయితే ఇప్పటిదాకా బీజేపీ ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. కనీసం అభ్యర్థి ఎవరైనా అనే దానిపైన కసరతు కూడా ప్రారంభించలేదు. నిన్ననే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాస్తున్న మొట్టమొదటి ఉప ఎన్నిక అలానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలోకి వస్తుంది అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో వాళ్ళకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో ఆ ఉనికి చాటుకోవడం ద్వారా జిహెచ్ఎంసి ఎన్నికల్లో కొంతవరకు సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో నిన్న త్రీ మెన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు..
జూటూరు కీర్తి రెడ్డి, డాక్టర్ వీరప్ప నేని పద్మ అలాగే.. లంకాల దీపక్ రెడ్డి తదితరులు అందరూ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ని ఆశిస్తూన్న నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన అటు బిజెపీ త్రీ మెన్ కమిటీని నిర్మించింది.. వీళ్ళ ముగ్గురు కూడా ఈ అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తారు అటు ధర్మారావు మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటు మాజీ ఎంపి పోతుగంటి రాములు కోమల ఆంజనేయులు ఈ ముగ్గురితో ఒక కమిటీ వేసింది. ఇక కచ్చితంగా బీసీ అభ్యర్థిని నిలబెడతామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
ఈ నేపథ్యంలోనే స్థానికుడైన నవీన్ యాదవ్ తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అలానే అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి ఆ దాన్ని ఐఐసికి పంపింది. ఈరోజు రేపు అభ్యర్థి పైన ప్రకటన కూడా వస్తుంది. నిన్న టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. ఇంకో రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామంటూ కూడా చెప్పారు. ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికలను తీసుకున్నాయి.. కచ్చితంగా ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది.
Also Read: వీరు పిల్లలు కాదు.. పిడుగుల.. సైకిల్ కోసం లోన్ కావాలని బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు..
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సర్వేలు చేయించింది. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా రావడంతో కచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనపడుతుంది. మరో రెండు రోజుల్లో అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది.. అలానే బీజేపీ కూడా అభ్యర్థి పైన ఈరోజు నుంచి కసరత్తు ప్రారంభిస్తుంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు అన్నిటిలో కూడా హడావిడి మొదలైంది వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని రంగంలో దించి ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి.. అయితే పోలింగ్ నవంబర్ 11న ఉంటుంది.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సన్నద్ధమం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. ఆ ప్రచారంలో కూడా ముందుకు దూసుకెళ్తుంది.