Sandeep Reddy Vanga: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఎక్కువగా బో*ల్డ్ కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఇప్పుడు ఏకంగా జోనర్ నే మార్చడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యువతలో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కంటెంట్ కి యువత విపరీతంగా కనెక్ట్ అయ్యింది అని చెప్పవచ్చు. ఈ సినిమాతో దర్శకుడిగా మలుపు తీసుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు లభించింది.
అలాంటి మార్క్ వేసిన సందీప్..
ఇక ఈ సినిమా తర్వాత చాలా ఏళ్లు విరామం తీసుకున్న సందీప్ రెడ్డి వంగ.. మళ్ళీ ‘యానిమల్’ సినిమా చేసి మరో సంచలనం సృష్టించారు. ఇందులో త్రిప్తి డిమ్రి(Tripti dimri) , రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్లలో హీట్ పెరిగిపోయింది. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే కచ్చితంగా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి అనేలా మార్క్ వేసేసారు సందీప్.
పోలీస్ డ్రామాగా స్పిరిట్..
అయితే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే (Deepika Padukone) ను హీరోయిన్గా తీసుకున్నారు.కానీ కొన్ని కారణాలవల్ల ఆమెను తప్పించి, త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. దాదాపు 9 భాషల్లో పాన్ ఇండియా వైడ్ విడుదల కాబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నుంచి సెట్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.
ప్రభాస్ తో పొలిటికల్ డ్రామా మూవీ తీస్తానంటున్న సందీప్..
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా మొదలు కానేలేదు. అప్పుడే సందీప్ రెడ్డివంగా పొలిటికల్ డ్రామా మూవీ చేస్తానని తన మనసులో మాటగా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. “దాదాపు మూడు గంటల పాటు ఎటువంటి పాటలు లేకుండా సాగే ఒక రాజకీయ చిత్రాన్ని రూపొందించాలి అనుకుంటున్నాను. ఇందులో ప్రభాస్ లీడ్ రోల్ అయితే ఎలా ఉంటుంది?” అంటూ అభిమానులనే ప్రశ్నించారు సందీప్ రెడ్డివంగా. మొత్తానికైతే ఇప్పటివరకు తన కంటెంట్ తో బో*ల్డ్ మార్క్ వేసిన సందీప్ రెడ్డివంగా.. ఇప్పుడు పొలిటికల్ మార్క్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారని, పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఒకవేళ నిజమైతే ఆ మార్క్ చెరిపేస్తారా?
ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో ఎలా ఉండబోతారు? ఆ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? పొలిటికల్ డ్రామా అంటున్నారు కదా ఎవరిని ఉద్దేశించి ఆ కథను తీర్చిదిద్దబోతున్నారు? ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఇక దీనిపై సందీప్ రెడ్డివంగా పూర్తి సమాచారం ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే బో*ల్డ్ కంటెంట్ క్రియేటర్ అనే మార్కును చెరిపేస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఆడియన్స్.
ALSO READ:Anasuya: వామ్మో అనసూయలో ఇంత టాలెంట్ ఉందా.. ఏకంగా వీఎఫ్ఎక్స్ కంపెనీలో అలాంటి పని!
#SandeepVanga – I WANT TO WRITE – 3 Hours Long POLITICAL Drama with Out Songs – What If it Happens With #Prabhas as Lead. pic.twitter.com/sAbZYlRfP1
— GetsCinema (@GetsCinema) July 23, 2025