Adivi Sesh Injured in Dacoit Movie Shooting: యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘డెకాయిట్’. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రిత యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగినట్టు సమాచారం. హీరో హీరోయిన్లకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. సెట్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
గతంలోనూ సెట్ లో ప్రమాదం
ఈ సంఘటనలో హీరోహీరోయిన్లు అడవి శేష్, మృణాల్ లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ హీరో, హరోయిన్లు అవే గాయాలతో షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక డెకాయిట్ సెట్ లో ప్రమాదాలు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో పలుమార్లు సెట్ లో ప్రమాదాలు సంభవించాయి. అప్పట్లో షూటింగ్ సెట్ లో గాయపడిట్టు మృణాల్ చెబుతూ గాయాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. కాగా అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ అలరిస్తున్నాడు. సినిమా, సినిమాకు గ్యాప్ తీసుకున్న మంచి కంటెంట్ వచ్చి హిట్స్ కొడుతున్నాడు.
ఇటూ హీరోగా.. అటూ అతిథిగా..
గుఢాచారి, ఎవరూ, మేజర్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. హో బేబీ, సైజ్ జీరో వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ పోషించాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క పాత్రకు ఇలా పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథల్లో అతిథి పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మేజర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ నుంచి మరో చిత్రం రాలేదు. లాంగ్ గ్యాప్ తీసుకుని డెకాయిట్ చిత్రం చేస్తున్నాడు. యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో అడవి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరు విడిపోయిన మాజీ ప్రేమికుల కథే ఈ డెకాయిట్. దీనికి భారీ యాక్షన్ సీక్వెన్స్ ని జత చేసి యాక్షన్ థ్రిల్లర్ గానూ రూపొందిస్తున్నాడు షానీల్ డియో. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
శ్రుతి స్థానంలోకి మృణాల్
అలాగే హీరోహీరోయిన్ల లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ పరిచయం అయ్యింది మరాఠీ బ్యూటీ మృణాల్. తన తెలుగు డెబ్యూ చిత్రం సీతారామం మూవీ ఆమెకు రాత్రికి రాత్రే టాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చింది. ఆ వెంటనే హాయ్ నాన్న మూవీ ఆఫర్ అందుకుంది. ఇందులో హీరో నానితో జతకట్టి ఆకట్టుకుంది. యక్ష్న పాత్రలో మృణాల్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ లో మెరిసిన ఆమె లాంగ్ గ్యాప్ తర్వాత డెకాయిట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా లో మొదట హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుంచి శ్రుతి తప్పుకోవడంతో మృణాల్ ను తీసుకున్నారు.