Anasuya:యాంకర్ అనసూయ (Anchor Anasuya).. ఈమె పేరు తెలియని సినీ, సోషల్ మీడియా జనాలు ఉండరు. ఓవైపు యాంకరింగ్ రంగంలో రాణించి, మరో వైపు సినిమా రంగంలో కూడా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాదు వీఎఫ్ఎక్స్ కంపెనీలో కూడా పని చేసిందట. మరి వీఎఫ్ఎక్స్ కంపెనీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో టాలెంట్ తో కూడుకున్న పని.. అలాంటి వీఎఫ్ఎక్స్ కంపెనీలో అనసూయ చేసిన వర్క్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూస్ ప్రెజెంటర్ నుండీ యాంకర్ స్థాయికి..
అనసూయ ఎంబీఏ పూర్తయ్యాక ఒక న్యూస్ ఛానెల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్(MAA Music) లో యాంకర్ గా వర్క్ చేస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. అలా వేదం (Vedam), పైసా (Paisa) వంటి సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత బుల్లితెరపై వచ్చిన ప్రముఖ కామెడీ షో అయినటువంటి జబర్దస్త్ (Jabardasth)షో లో యాంకర్ గా చేసి తన కెరీర్ ని మార్చేసుకుంది. ఎందుకంటే జబర్దస్త్ షో తర్వాత అనసూయకు యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో తో యాంకర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన అనసూయ.. ఆ తర్వాత నాగార్జున (Nagarjuna) నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో నటిగా మారింది.అలా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించినప్పటికీ అనసూయకి మంచి గుర్తింపు లభించింది.
వరుస సినిమాలతో భారీ గుర్తింపు..
తర్వాత క్షణం(Kshanam) మూవీలో కూడా నటించింది. ఇక సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం (Rangasthalam) మూవీలో రంగమ్మత్త పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది.ఇక పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప-1, పుష్ప -2 (Pushpa-2) సినిమాల్లో ద్రాక్షాయిణి అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కూడా నటించి అదరగొట్టింది.దాంతో అనసూయని కీ రోల్స్ కోసం చాలామంది దర్శకనిర్మాతలు సినిమాల్లో తీసుకుంటున్నారు. ఇక విమానం(Vimanam) సినిమాలో వేశ్య పాత్రలో కూడా అదరగొట్టింది. అయితే అలాంటి అనసూయకి కేవలం యాంకరింగ్, సినిమా రంగంలో మాత్రమే కాదు వీఎఫ్ఎక్స్(VFX) రంగంలో కూడా మంచి అనుభవం ఉందట.
అనసూయలో ఇంత టాలెంట్ ఉందా?
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు వీఎఫ్ఎక్స్ రంగంలో పని చేసాను.అందులో 8,10 గంటలు పని చేస్తానంటే కుదరదు.వెట్టి చాకిరి చేయాలి. ఒక ప్రాజెక్టు మనకు అప్పగిస్తే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇవ్వాలి. నేను అలా వీఎఫ్ఎక్స్ కంపెనీ(VFX Company )లో వర్క్ చేస్తున్నప్పుడే సుక్కు సార్, త్రివిక్రమ్ (Trivikram) సార్, మెహర్ రమేష్ నన్ను చూశారు. అలా వాళ్లతో నాకు పరిచయం ఏర్పడింది. ఇక వీఎఫ్ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను కౌన్సిలర్ గా, హెచ్ఆర్ గా కూడా చేశాను. ఎన్టీఆర్ కంత్రి సినిమాలో చిన్న వీఎఫ్ఎక్స్ షార్ట్ ఉంటుంది కదా.. అందులో కూడా మేము పనిచేసాము అంటూ తెలిపింది
అప్పుడే మా ఆయనతో డేటింగ్ లో ఉన్నా – అనసూయ
ఆ టైంలో నేను మా ఆయనతో డేటింగ్ లో ఉన్నాను అంటూ ఓ షాకింగ్ విషయాన్ని కూడా అనసూయ చెప్పింది.ఇక అనసూయ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు అనసూయ యాంకర్ గా..నటిగా..మాత్రమే కాదు వీఎఫ్ఎక్స్ రంగంలో కూడా పనిచేసిందా..? ఆమెలో ఈ టాలెంట్ ఉందా? అని మాట్లాడుకుంటున్నారు.
"Do you remember the small animated NTR character in Kantri? I was working as an HR at that VFX company back then – that’s when directors like #Sukumar, Meher Ramesh, and others noticed me."
– #AnasuyaBharadwaj | #JrNTR pic.twitter.com/2TC5aOHqF5
— Whynot Cinemas (@whynotcinemass_) July 22, 2025