Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం 21 మంది లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు.. పార్టీ నిర్మూలన దిశగా సాగుతోంది. గత కొన్ని నెలలుగా వందలాది మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరికొందరు లొంగిపోతూ పార్టీని బలహీనపరుస్తున్నారు.
తాజాగా కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ లొంగుబాట్లు పార్టీ కీలక నాయకత్వంపై గట్టి దెబ్బ తగిలింది.
ఈ క్రమంలో కాంకేర్‌లో 21 మంది, 18 ఆయుధాలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా కేశ్‌కాల్ డివిజన్లో శనివారం (అక్టోబర్ 25) మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ బృందం 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించింది.
అప్పగించిన ఆయుధాల్లో 3 AK-47 రైఫిల్స్, 4 SLR, 2 INSAS రైఫిల్స్, 6 .303 రైఫిల్స్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, 1 BGL (Barrel Grenade Launcher)
వీరి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం అని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు. వరుస లొంగుబాట్లు.. పార్టీపై భారీ దెబ్బ.. గత కొన్ని వారాలుగా మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకున్నాయి.
Also Read: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక
అక్టోబర్ 17న బస్తర్ జిల్లా జగదల్‌పూర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ (ఆశన్న)తో సహా.. 210 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. వీరు 153 ఆయుధాలు అప్పగించారు. అక్టోబర్ 2 బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్‌రావు నేతృత్వంలో 61 మంది సరెండర్ అయ్యారు.