E-Paper
Advertisement

సోగ్గాడు మోహన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

సోగ్గాడు మోహన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
Advertisement

Shobhan Babu:ఆంధ్ర సోగ్గాడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు దివంగత నటులు శోభన్ బాబు. అప్పట్లో రిచెస్ట్ హీరోగా కూడా పేరు దక్కించుకున్న ఈయన.. వయసు మీద పడడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు అంగీకరించకుండా.. అభిమానులు మెచ్చిన సోగ్గాడిగానే మిగిలిపోయారు. అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకొని.. ఫ్యామిలీ హీరోగా పేరు దక్కించుకున్న శోభన్ బాబు.. మన మధ్య లేకపోయినా ఆయనను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆయన సినిమాలు ఎన్నో ఆకట్టుకుంటున్నాయి.

శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..

ఇదిలా ఉండగా శోభన్ బాబు మరణం తర్వాత చెన్నైలో నివసిస్తున్న ఆయన భార్య శాంతకుమారి మరణించారనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. ఇటీవల రెండు నెలల క్రితం కూడా శాంతకుమారి ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే అంతలోనే ఆమె కళ్ళు మూసారంటూ వచ్చిన వార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. రెండు నెలల క్రితమే కదా శాంతకుమారిని చూసింది.. అప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆమె ఇంతలోనే ఏం జరిగింది? అనే కోణంలో అభిమానులు ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శోభన్ బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలోని తన నివాసంలో వయోభారంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

వయోభారంతో మృతి..

Advertisement

ఆంధ్ర సోగ్గాడిగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందిన శోభన్ బాబు.. 2008లో గుండెపోటుతో మరణించారు. అప్పటినుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి శాంతకుమారి చెన్నైలోనే నివసిస్తున్నారు. భర్త సినీ రంగంలో అగ్ర హీరోగా కొనసాగినప్పటికీ.. ఆమె ఎప్పుడూ కూడా ప్రచారానికి దూరంగా.. నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. అలాంటి శాంతకుమారి మరణ వార్త తెలిసిన వెంటనే అటు శోభన్ బాబు అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

also read:ఆ పలకరింపే ఊపిరిపోసింది.. రాశీఖన్నా ఎమోషనల్ పోస్ట్!

శోభన్ బాబు – శాంతకుమారి వివాహం..

Advertisement

శోభన్ బాబు సినీ రంగంలో ప్రవేశించక ముందే 1958 మే 15న శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కాగా.. అందులో ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు. మృదుల, ప్రశాంతి, నివేదిత, కుమారుడు కరుణ శేషు ఉన్నారు. కరుణ శేషు తండ్రి లాగే సినిమాల్లోకి రాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

Related News

ఆ పలకరింపే ఊపిరిపోసింది.. రాశీఖన్నా ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

Big Stories

Advertisement
×