Naveen Comedy:జాతి రత్నాలు..ఈ సినిమా కథ పెద్దగా లేకున్నా అంతలా కాసుల వర్షం కురిపించిందంటే అదంతా నవీన్ పోలిశెట్టి టైమింగ్ వల్లే.ఒకరకంగా చెప్పాలంటే ఈ కుర్ర హీరో ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల వర్షమే. తాజాగా అలాగే మరోసారి నవ్వుల వర్షం కురిపించాడు నవీన్ పోలిశెట్టి.అవును …తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక అఫీషియల్ పోలీస్ ఈవెంట్ లో నవీన్ చేసిన హంగామా ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు సినిమాల్లోనే కాదు ఇటు బయటకూడా నవ్విస్తానని మరో ప్రూవ్ చేసుకున్నాడు.
విషయంలోకి వెళ్తే తాజగా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆద్వర్యంలో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ గ్రాండ్ ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు ఈ కుర్ర హీరో.ఇక అలా స్టేజ్ పైకి వచ్చాడో లేదో అక్కడున్న వారందరినీ నవ్వుల వర్షంలో ముంచెత్తాడు.అతడు చేసిన కామెడీకి అక్కడున్న ఐపీఎస్ క్యాడర్ నుండి కానిస్టేబుళ్ల వరకు అందరు కడుపుబ్బా నవ్వుకున్నారు.
మేడమ్ గారూ… మీ అండర్‌కవర్ ఆపరేషన్ చూశా
కొద్దిరోజుల క్రితం మహిళల రక్షణ కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ పద్మజా సుమతి గారు స్వయంగా రంగంలోకి దిగి చేసిన ఒక అండర్‌కవర్ ఆపరేషన్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. దాన్ని గుర్తు చేస్తూనే సుమతి మేడమ్ గారూ… మీ అండర్‌కవర్ ఆపరేషన్ చూశాను, మీ యాక్టింగ్ అదరహో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు నవీన్.
అంతేకాదు, నా నెక్స్ట్ సినిమాలో మీకోసం ఒక రోల్ ఖాయం. మనం ఇద్దరం కలిసి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్‌లో ఒక ఇన్వెస్టిగేషన్ కేసును సాల్వ్ చేస్తే థియేటర్లు షేక్ అయిపోవడం పక్కా అనడంతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వేశారు. ఇక అక్కడే ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సి.వి. ఆనంద్ తో నవీన్ చేసిన కామెడీ ఈవెంట్ కే హైలెట్ .
సార్.. నాకు గన్ ఎలా పట్టుకోవాలో కొంచెం నేర్పిస్తారా అని నవీన్ అడగగా, డీజీపీ గారు నవ్వుతూ, ట్రైనింగ్ ఇస్తాం కానీ.. ఒరిజినల్ బుల్లెట్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు అని కౌంటర్ ఇచ్చారు. దానికి నవీన్ ఏమాత్రం తగ్గకుండా, సార్.. మా సినిమాల్లో వాడేవన్నీ డూప్లికేట్ బుల్లెట్లే, అయినా నాకు గన్ ఎత్తడం కూడా రాదు బాబోయ్ అంటూ తనదైన హ్యూమర్ తో కామెడీ చేయడంతో హాలంతా నవ్వులతో ఊగిపోయింది.
ఈ కామెడీ వీడియో ఇపుడు నెట్టింట వైరల్
ఇక ఇదే క్రమంలో తన సినిమాలకి సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ వదిలాడు నవీన్. కెరీర్‌లో 2019లో ‘ఏజెంట్ ఆత్రేయ, 2021లో ‘జాతిరత్నాలు’ 2023లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’,2026 లో అనగనగా ఒక రాజు సినిమాలతో సాలిడ్ హిట్స్ చూసిన నవీన్ ఫస్ట్ టైమ్ తన లైఫ్‌లో ఒక ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేశాడు.మొత్తానికి పోలీసులతో నవెన్ పోలిశెట్టి చేసిన ఈ కామెడీ వీడియో ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.